ఇంటి మీద దాడులు, మాజీ సీఎం క్లారిటీ, ఎందుకు చేశారు ?, ఎవరు చేశారు అంటే ?
బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీల నాయకులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. శివమొగ్గ జిల్లాలోని శికారిపురలో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఇంటి దగ్గర బంజారా కులస్తులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఆ సందర్బంలో పోలీసులు యడియూరప్ప ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో బంజారా కులస్తులు మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప ఇంటి వైపు దూసుకుపోయి రాళ్ల వర్షం కురిపించారు.
పోలీసుల లాఠీ చార్జ్ లో అనేక మందికి గాయాలైనాయి. గాయాలైన వారిని ఆసుపత్రులకు తరలించారు. రిజర్వేషన్ల విషయంలో మాకు అన్యాయం జరిగిందనని బంజారా కులస్తులు ఆరోపిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా శివమొగ్గతో పాటు బెంగళూరులోని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఇంటి దగ్గర పోలీసులు గట్టిబందో బస్తు ఏర్పాటు చేశారు.

బీఎస్. యడియూరప్ప ఇంటి మీద దాడి జరగడాన్ని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ తో పాటు పలువురు నాయకులు ఖండించారు. ఈ సందర్బంగా మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మాట్లాడుతూ తన ఇంటి మీద దాడి జరిగిన విషయంపై తాను ఎవ్వరిని దూషించనని, ఎవ్వరి మీద ఆరోపణలు చెయ్యనని అన్నారు. అయితే తన ఇంటి మీద దాడి జరగడం బాధగా ఉందని యడియూరప్ప విచారం వ్యక్తం చేశారు.
తాను నాలుగుసార్లు ముఖ్యమంత్రి కావడానికి బంజారా కులస్తుల సహాయసహకారాలు ఎంతో ఉందని, వారికి తాను ఎంతో సేవ చేశానని, అయితే ఎందుకు ఇలా జరిగిందో తనకు అర్థం కావడం లేదని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు. త్వరలో తాను, తన కుమారుడు విజయేంద్ర శికారిపుర వెళ్లి బంజారా కులస్తులతో చర్చించి సమస్యను పరిష్కారిస్తామని బీఎస్. యడియూరప్ప అన్నారు. కర్ణాటకలో రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో 90 శాతం మంది సంతోషంగానే ఉన్నారని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు.












Click it and Unblock the Notifications