Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Reddy: జైలుకు వెళ్లకుండా ఉంటే ఈ రోజు నేను అంబాని, ఆదాని లిస్ట్ లో ఉండేవాడిని, గాలి జనార్దన్ రెడ్డి!

నేను వ్యాపారం చేస్తూ ఉంటే ఈ రోజు అంబాని, ఆదాని తరువాత ఆ లిస్టులో నా పేరు కూడా ఉండేదని, తన మీద కక్షతో నాలుగు సంవత్సరాలు జైల్లో పెట్టి నా మీద కొందరు పగ తీర్చుకున్నారని గాలి జనార్దన్ ఆరోపించారు.

బెంగళూరు/బళ్లారి: నాతో నమ్మకంగా ఉంటూ, నా వెంట ఉంటూనే నాకు వెన్నుపోటు పొడిచేశారని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. నా అవసరం తీరిపోయిన తరువాత తనను కరివేపాకులా చూశారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. నేను వ్యాపారం చేస్తూ ఉంటే ఈ రోజు అంబాని, ఆదాని తరువాత ఆ లిస్టులో నా పేరు కూడా ఉండేదని, తన మీద కక్షతో నాలుగు సంవత్సరాలు జైల్లో పెట్టి నా మీద కొందరు పగ తీర్చుకున్నారని గాలి జనార్దన్ ఆరోపించారు.

గాలి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి రేసులో ఉన్నాడని కొందరు బావించి తన మీద అక్రమంగా కేసులు పెట్టారని, తాను ప్రభుత్వ భూమిని, స్థలాలను కబ్జా చెయ్యాలని గాలి జనార్దర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ సమావేశాలు

పార్టీ సమావేశాలు

కల్యాణ రాజ్య ప్రగతి అనే రాజకీయ పార్టీని స్థాపించిన తరువాత కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి దూకుడు పెంచారు. నాతో ఉంటూ నన్ను చాలా మంది మోసం చేశారని గాలి జనార్దన్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ బహిరంగ సమావేశాలు, సన్నిహితులతో సమావేశాల జోరు పెంచిన గాలి జనార్దన్ రెడ్డి తనను నమ్మించి మోసం చేసి నా గొంతు కోశారని కొందరి పేర్లు చెప్పకుండానే కొందరి మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఆ ఊరి మీద ఫోకస్ పెట్టిన గాలి

ఆ ఊరి మీద ఫోకస్ పెట్టిన గాలి

కల్యాణ రాజ్య ప్రగతి పార్టీని హిరయూరు ప్రజలు ఆదరిస్తారని గాలి జనార్దన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కూడా హిరియూరు ప్రజలు తన మీద ప్రేమ, ఆప్యాయత చూపించారని, ఈ నియోజక వర్గంలోని ప్రతి ఒక్కరికి తాను పేరుపేరుగా కృతజ్ఞతలు చెబుతున్నానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.. 2008లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి హిరియూరు ప్రజలే కారణమని, ఇక్కడ భారీ మెజారిటీతో తాను నిలబెట్టిన వ్యక్తికి విజయం అందించారని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు.

110 సీట్లు రావడానికి నేను ఏమీ చెయ్యలేదా?

110 సీట్లు రావడానికి నేను ఏమీ చెయ్యలేదా?

2008లో బీజేపీ 110 సీట్లు గెలుచుకుంది. ఆ సమయంలో బీజేపీ విజయం సాధించడానికి నేను ఏమీ చెయ్యలేదా అని కొందరు బీజేపీ నాయకులను గాలి జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. 2008లో బీజేపీ అధికారంలోకి రావడానికి హిరియూరు ఓటర్ల ఆశీస్సులు ఎంతో ఉందని, అందుకే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. నేను డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు, నాకు తల్లి లాంటి దివంగత సుష్మాస్వారజ్ కోసం అప్పట్లో తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆ రోజు తనకు సుష్మా స్వరాజ్ అశీస్సులు ఉన్నాయని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

అంబాని, ఆదాని, ఆ జాబితాలో నా పేరు ఉండేది: గాలి

అంబాని, ఆదాని, ఆ జాబితాలో నా పేరు ఉండేది: గాలి

నేను మైనింగ్ వ్యాపారం చేశాను, ప్రజలకు సేవ చేస్తూ చాలా వ్యాపారాలు చేశాను. ఆ రోజు చేస్తున్నట్లు ఇప్పటికి నేను వ్యాపారాలు చేసి ఉంటే అంబాని, ఆదాని తరువాత ఆ జాబితాలో నా పేరు కూడా ఉండేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. అయితే కుట్రలు. కుతంత్రాలు, కుళ్లు రాజకీయాల నేపథ్యంలో తన మీద అక్రమంగా కేసులు పెట్టి నాలుగు సంవత్సరాల పాటు జైల్లో పెట్టారని, నా వ్యాపారాలు మొత్తం దెబ్బ తిన్నాయని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. నేను జైలుకు వెళ్లకుండా అప్పటిలాగే వ్యాపారాలు కొనసాగించి ఉంటే ఈ రోజుల ఆదాని, అంబానిల లాగా తాను ప్రముఖ పారిశ్రామిక వేత్తల జాబితాలో ఉండేవాడనని, తనను నిలువునా మోసం చేశారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

 నేను ప్రభుత్వ భూములు కబ్జా చేసి జైలుకు వెళ్లలేదు

నేను ప్రభుత్వ భూములు కబ్జా చేసి జైలుకు వెళ్లలేదు

తాను సక్రమంగానే మైనింగ్ వ్యాపారం చేశానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వ భూములు ఆక్రమించుకోలేదని, ప్రభుత్వ భూములు కబ్జా చేసి జైలుకు వెళ్లలేదని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. కొందరి స్వార్థ రాజకీయాలకు తాను బలి అయ్యాయని, తాను జైలుకు వెళ్లిన తరువాత చాలా మంది కళ్లు చల్లబడ్డాయని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

డబ్బు సంపాధించడానికి తాను రాజకీయాలు చెయ్యాల్సిన అవసరం లేదని, తనను నమ్ముకున్న వారి కోసం, ప్రజలకు సేవ చెయ్యడానికి నేను రాజకీయాల్లోకి వచ్చానని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.

 నేను చేతులు కట్టుకుని ఇంట్లో కుర్చలేదు

నేను చేతులు కట్టుకుని ఇంట్లో కుర్చలేదు

జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత తనను నా సొంత ఊర బళ్లారికి వెళ్లకుండా చేశారని గాలి జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాల నుంచి తాను చేతులు కట్టుకుని ఇంట్లో కుర్చోలేదని, ప్రజల్లో తిరిగానని, తన మద్దతుదారులు, తనను ఇంతకాలం ఆధరించిన అందరి అభిప్రాయాలు తెలుసుకున్నానని, తరువాత తాను కల్యాణ రాజ్య ప్రగతి అనే కొత్త రాజకీయ పార్టీ స్థాపించానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

మైనింగ్ కింగ్ పేరు అలాగే ఉండేదేమో?

మైనింగ్ కింగ్ పేరు అలాగే ఉండేదేమో?

తాను కుళ్ల రాజకీయాలు చెయ్యను, తనను నమ్ముకుని తన పార్టీ తరపున పోటీ చేసే ప్రతి ఒక్కరిని గెలిపించుకుంటానని, గతంలో లాగే తన కొత్త రాజకీయ పార్టీని ప్రజలు ఆధరిస్తారని నమ్మకంతో ముందుకు వెలుతున్నానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. నిజంగానే గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లకుండా ఉండిఉంటే దేశంలో మైనింగ్ కింగ్ అనే పేరును గాలి జనార్దన్ రెడ్డి నిలబెట్టుకునే వాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+