Illegal affair: పంప్ సెట్ రూమ్ లో ప్రియుడితో భార్య ఫుల్ బిజీ, భర్త చూశాడని ఏం చేశారంటే!
బెంగళూరు/ మైసూరు: ప్రియుడి వ్యామోహంలో కట్టుకున్న భర్తపై అతని భార్యకు విరక్తి చెందింది. తనకంటే భర్త 14 ఏళ్లు పెద్దవాడని భావించిన భార్య ఆమె వయసుకు సరిసమానంగా ఉన్న వ్యక్తిని లైన్ లో పెట్టింది. అంతే భర్త ఊరికి వెళ్లిన సమయంలో, పొలం దగ్గర పనులు చూసుకోవడానికి వెళ్లిన టైమ్ లో భార్య ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసింది. నెల రోజుల క్రితం పంప్ సెట్ దగ్గర రూమ్ లో భార్య నగ్నంగా ప్రియుడితో కలిసి ఎంజాయ్ చూస్తూ రెడ్ హ్యాండెడ్ గా భర్తకు చిక్కిపోయింది. ఎక్కడ మా బండారం బయటపడుతుందో అనే భయంతో భర్తను అతని భార్య, ప్రియుడు కలిసి వెంటాడి వెంటాడి చంపేసి నాటకాలు ఆడారు. అసలే స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న పోలీసులను మోసం చెయ్యడం భార్యకు, ఆమె ప్రియుడికి సాధ్యం కాలేదు.

భార్య, భర్తకు 14 ఏళ్లు తేడా
కర్ణాటకలోని మైసూరు జిల్లా సమీపంలోని చామరాజనగర జిల్లా, గుండ్లుపేట తాలుకా బేగూరు రామనాథపురంలో నాగరాజ్ నాయక్ (40), పద్మావతి అలియాస్ పద్మా (26) దంపతులు నివాసం ఉంటున్నారు. నాగరాజ్ నాయక్, పద్మాకు వయసులో 14 ఏళ్ల తేడా ఉంది. తనకంటే చాలా ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశారని పద్మా చాలాకాలంగా అసహనంతో ఊగిపోయింది.

ప్రియుడిని వెతుక్కున్న పద్మావతి
పద్మావతి నివాసం ఉంటున్న ప్రాంతం సమీపంలోనే మణికంఠ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మణికంఠకు ఇంకా వివాహం కాలేదు. తన వయసుకు సరిసమానంగా ఉన్న మణికంఠ మీద పద్మావతి మనసుపారేసుకుంది. పద్మావతి, మణికంఠల పరిచయం కాస్తా చనువుగా మారడంతో అక్రమ సంబంధానికి దారితీసింది.

బావా ఉన్నావా ? లేదా
నాగరాజ్ నాయక్ కు, మణికంఠకు పరిచయం ఉంది. నాగరాజ్ ను మణికంఠ బావా అని పిలిచేవాడు. అప్పుడప్పుడు బావా ఉన్నావా ? అంటూ అతనికి ఇంటికి వెలుతున్న మణికంఠ రహస్యంగా ప్రియురాలు పద్మాను చూసి లోట్టలో వేసుకుంటూ కాలం గడిపివాడు. ఇలా నాగరాజ్ ఇంట్లో లేని సమయంలో మణికంఠ, పద్మావతి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు.

మొగుడు ఊరికి వెళితే పండగే
నగరాజ్ వ్యాపారం పని మీద మైసూరు, బెంగళూరుకు వెళ్లిన సమయంలో మణికంఠ, పద్మావతి అడ్డూఅదుపులేకుండా ఎంజాయ్ చేశారు. తాను ఊరికి వెలుతున్నానని, పొలం దగ్గరకు వెళ్లి పనులు చేయించాలని భర్త నాగరాజ్ భార్య పద్మాకు చెప్పేవాడు. పొలం దగ్గరకు వెలుతున్న పద్మా అక్కడికి ప్రియుడు మణికంఠను పిలిపించుకుని ఎంజాయ్ చేసేది. పొలం పనులకు వెళ్లేవాళ్లు పద్మా, మణికంఠ భాగోతం గుర్తించి నాగరాజ్ కు సమాచారం ఇచ్చారు.

పంప్ సెట్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు
సెప్టెంబర్ 11వ తేదీన నాగరాజ్ పని మీద మైసూరు వెళ్లాడు. భర్త ఊరికి వెళ్లాడని, రేపు సాయంత్ర వస్తాడని భావించిన పద్మా పొలం దగ్గర పంప్ సెట్ రూమ్ లో ప్రియుడు మణికంఠతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. వెళ్లిన పని వాయిదా పడటంతో నాగరాజ్ అనుకోకుండా ఊరికి వెళ్లాడు. ఇంట్లో భార్య పద్మా లేదని తెలుసుకున్న నాగరాజ్ పొలం దగ్గరకు వెళ్లాడు. అంతే పొలం దగ్గర ఉన్న పంప్ సెట్ రూమ్ లో భార్మ పద్మా, ఆమె ప్రియుడు మణికంఠ శరీరం మీద నూలుపోగు కూడాలేకుండా ఎంజాయ్ చూస్తూ అడ్డంగా చిక్కిపోయారు.

భర్తను వెంటాడి చంపిన భార్య, ప్రియుడు
నేను ఊరికి వెళ్లిన సమయంలో నువ్వు చేస్తున్న పని ఇదేనా ? అంటూ నాగరాజ్ మండిపడ్డాడు. రేపు పంచాయితీ పెట్టి నీ అంతుచూస్తానని వార్నింగ్ ఇచ్చిన నాగరాజ్ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భయపడిన భార్య పద్మా, ప్రియుడు మణికంఠ అక్కడి నుంచి వెళ్లిపోతున్న నాగరాజ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే నాగరాజ్ పారిపోవడానికి ప్రయత్నించడంతో అర్దరాత్రి అతన్ని వెంటాడి వెంటాడి కొడవలి, బండరాళ్లు తీసుకుని దాడి చేసి చంపేశారు.
Recommended Video

భార్య నాటకాలు అదుర్స్
నాగరాజ్ ను చంపేసిన తరువాత అతని మృతదేహాన్ని అర్దరాత్రి కళలే నదీ కాలువలో విసిరేశారు. మైసూరుకు పనిమీద వెళ్లిన తన భర్గ నాగరాజ్ కనపడటం లేదని భార్య పద్మా సెప్టెంబర్ 16వ తేదీన బేగూరు పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకాలు ఆడింది. అసలే స్మార్ట్ ఫోన్లు, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్న పోలీసులు పద్మా మొబైల్ ఫోన్ డేటా పరిశీలించారు. రోజుకు లెక్కలేనన్నిసార్లు పద్మా, మణికంఠ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారని గుర్తించిన పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకుని బెండ్ తియ్యడంతో అసలు విషయం వెలుగు చూసింది. పద్మా, ఆమె ప్రియుడు మణికంఠను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. నదీకాలువలో కొట్టుకుపోయిన నాగరాజ్ మృతదేహం కోసం బేగూరు పోలీసులు గాలిస్తున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications