Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: నేను అంటే లెక్కలేదు, మొబైల్ ఫోన్, లేదంటే ప్రియుడితో ?, అందుకే చంపేశాను, పిన్ టూ పిన్ చెప్పి!

బెంగళూరు: భార్య ఉదయం ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వెళ్లింది. మూడు రోజుల ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లి తరువాత ఆమె ఎవ్వరికి కనపడలేదు. మహిళ ఇంటి నుంచి బయటకు రాలేదు. మహిళ, ఆమె భర్త ఊరికి వెళ్లి ఉంటారని చుట్టుపక్కల వాళ్లు అనుకున్నారు. బయట తాళం వేసి ఉన్న ఇంటిలోనే ఆమ శవమై కనిపించింది. మూడు రోజుల క్రితమే ఆమె హత్యకు గురైయ్యిందని వెలుగు చూసింది.

మహిళ భర్త కూడా మూడు రోజుల నుంచి మాయం అయ్యాడు. ఎట్టకేలకు మహిళ భర్తను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో భార్యను నేను హత్య చేశానని ఆమె భర్త అంగీకరించాడు. విపరీతంగా మొబైల్ ఫోన్ లో కాలం గడుపుతున్న నా భార్య ప్రియుడితో జల్సా చేస్తోందని, ఎంత చెప్పినా ఆమె పద్దతి మార్చుకోకపోవడం వలనే చంపేశానని భర్త అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

అమ్మమ్మ ఇంటిలో పిల్లలు

అమ్మమ్మ ఇంటిలో పిల్లలు

బెంగళూరు నగరంలోని కామాక్షిపాళ్యలోని కావేరిపురంలో వనజాక్షి (34), అశోక్ బాబు అలియాస్ అశోక్ (37) దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లి చేసుకున్న అశోక్, వనజాక్షి దంపతులు కొంతకాలం క్రితం వరకు సంతోషంగా కాపురం చేశారు. అశోక్, వనజాక్షి దంపతుల పిల్లలు తుమకూరులోని అమ్మమ్మ ఇంటిలో ఉంటున్నారు.

భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం

వనజాక్షి కామాక్షిపాళ్యలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తుంటే ఆమె భర్త అశోక్ సొంతంగా కారు తీసుకుని క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వనజాక్షి ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వెలుతోంది. క్యాబ్ డ్రైవర్ గా ఎక్కువ బయట తిరుగుతున్న అశోక్ కు అతని భార్య వనజాక్షి మీద అనుమానం ఉంది.

మొబైల్ ఫోన్.... సోషల్ మీడియాలో టైమ్ పాస్

మొబైల్ ఫోన్.... సోషల్ మీడియాలో టైమ్ పాస్

చూడటానికి కొంచెం అందంగా ఉంటున్న వనజాక్షి నిత్యం మొబైల్ ఫోన్ లో బయట వ్యక్తులతో మాట్లాడుతోందని, సోషల్ మీడియాలో కాలం గడుపుతోందని ఆమె భర్త అశోక్ గమనించాడు. నువ్వు మొబైల్ ఫోన్ వాడటం తగ్గించాలని అశోక్ అతని భార్య వనజాక్షికి ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాడని వాళ్ల బంధువులు అంటున్నారు.

 ఇన్ కమిగింగ్.... ఔట్ గోయింగ్ ఫోన్ కాల్స్ తో?

ఇన్ కమిగింగ్.... ఔట్ గోయింగ్ ఫోన్ కాల్స్ తో?

గార్మెంట్స్ లో ఉద్యోగం చేస్తున్న మగాళ్లతో ఎక్కువగా మాట్లాడుతున్న వనజాక్షి భర్త అశోక్ ఇంటికి వచ్చినా కూడా ఆమె పద్దతి మార్చుకోలేదని తెలిసింది. ఇంటికి వెలుతున్న అశోక్ అతని భార్య వనజాక్షి మొబైల్ ఫోన్ తీసుకుని ఆమె ఎవరెవరికి ఫోన్లు చేసింది, ఆమెకు ఎవరెవరు ఫోన్లు చేశారు అంటూ మొత్తం ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ పరిశీలించి అదే విషయంలో గొడవపెట్టుకుని భార్యను పట్టుకుని చితకబాదేశాడు.

ఇంట్లో భార్యను చంపేసి ఎస్కేప్

ఇంట్లో భార్యను చంపేసి ఎస్కేప్

ఏప్రిల్ 17వ తేదీన ఉదయం ఉద్యోగానికి వెళ్లిన వనజాక్షి సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లింది. తరువాత వనజాక్షి ఎవ్వరికి కనపడలేదు. వనజాక్షి ఇంటి నుంచి బయటకు రాలేదు. వనజాక్షి ఇంటి బయట తాళం వేసి ఉండటం, ఆమె కనపడకపోవడంతో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆమె శవమై కనిపించింది. వనజాక్షిని చంపేసిన ఆమె భర్త అశోక్ ఇంటి బయట తాళం వేసి మాగడిలోని స్నేహితుడి ఇంటికి వెళ్లి తలదాచుకున్నాడు.

పిన్ టూ పిన్ చెప్పిన భర్త

పిన్ టూ పిన్ చెప్పిన భర్త

పక్కా సమాచారం అందడంతో అశోక్ ను అరెస్టు చేశామని బెంగళూరు పోలీసులు అన్నారు. పోలీసుల విచారణలో భార్య వనజాక్షిని నేను హత్య చేశానని ఆమె భర్త అశోక్ అంగీకరించాడు. విపరీతంగా మొబైల్ ఫోన్ లో కాలం గడుపుతున్న నా భార్య వనజాక్షి ఆమె ప్రియుడితో జల్సా చేస్తోందని, ఎంత చెప్పినా ఆమె పద్దతి మార్చుకోకపోవడం వలనే చంపేశానని ఆమె భర్త అశోక్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+