సొంత హెలికాఫ్టర్ పై గాలి జనార్థన్ రెడ్డి క్లారిటీ..!
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక రాజకీయాల్లో మారోసారి చక్రం తిప్పాలని మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి బయటకు వచ్చి కేఆర్ పీ పార్టీ పెట్టిన గాలి జనార్దన్ రెడ్డి రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనన్ని నియోజక వర్గాల్లో కేఆర్ పీ అభ్యర్థులతో పోటీ చేయించి వారిని గెలిపించుకోవాలని గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
కోప్పళ జిల్లాలోని గంగావతి నియోజక వర్గం నుంచి గాలి జనార్దన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బళ్లారి సిటీ నియోజక వర్గం నుంచి తన సతీమణి గాలి లక్ష్మీ అరుణ పోటీ చేస్తారని ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం బళ్లారి సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే (బీజేపీ) గాలి సోమశేఖర్ రెడ్డి స్వయానా గాలి జనార్దన్ రెడ్డి సొంత తమ్ముడు అనే విషయం తెలిసిందే.

తాను సొంతంగా హెలికాప్టర్ తీసుకుని గాలిలో తిరుగుతున్నానని, ప్రజలకు అందుబాటులో ఉండనని కొందరు కామెంట్స్ చేస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. గంగావతి నియోజక వర్గం ఓటర్లతో మాట్లాడిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తాను ఎందుకు సొంతంగా హెలికాప్టర్ తీసుకున్నాను అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు.
గతంలో తాను బళ్లారి నుంచి బెంగళూరుకు ఎక్కువ తిరగాల్సి వచ్చిందని, ప్రయాణానికి ఎక్కువ సమయం పట్టేదని, సమయం వృధా అవుతుందని, సమయం వృధా కాకుండా ఉండటానికే తాను హెలికాప్టర్ కొనుక్కున్నానని గాలి జనార్దన్ రెడ్డి వివరణ ఇచ్చారు. అప్పట్లో తాను మంత్రిగా పనిచేసే సమయంలో బళ్లారి-బెంగళూరు మధ్య ఎప్పుడంటే అప్పుడు తిరగవలసి వచ్చిందని జనార్దన్ రెడ్డి అన్నారు.
గంగావతి నుంచి తానను ఎమ్మెల్యేగా గెలిపించినా తాను ఇక్కడి నుంచి బెంగళూరుకు హెలికాప్టర్ లోనే తిరుగుతానని, నిత్యం గంగావతి ప్రజలకు అందుబాటులోనే ఉంటానని గాలి జనార్దన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంతే కాని తాన హోదా చూపించుకోవడానికే, బిల్డప్ ఇవ్వడానికి తాను సొంతంగా హెలికాప్టర్ కొనుగోలు చెయ్యలేదని మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications