భర్తతో కటీఫ్: ప్రియుడితో రొమాన్స్: పాడుబడిన వ్యవసాయ బావిలో డెడ్‌బాడీ
బెంగళూరు: కర్ణాటకలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. మరో మతానికి చెందిన వాడిని తమ కుమార్తె ప్రేమించిందనే కారణంతో తల్లిదండ్రులు సొంత కుమార్తెను దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు మృతురాలి పెదనాన్న సహకరించాడు. ఈ ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని ఓ వ్యవసాయ బావి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. చిక్‌బళ్లాపూర్‌లోని గౌరిబిదనూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.

లివింగ్ రిలేషన్
మృతురాలి పేరు పర్వీనా బాను. ఆమె తల్లిదండ్రులు గుల్జార్ బాను, ఫయాజ్‌తో కలిసి గౌరిబిదనూరులో నివసిస్తున్నారు. పదేళ్ల కిందట ఆమెకు వివాహమైంది. రెండేళ్లకే ఆమె అత్తింటిని వదిలి పెట్టారు. గౌరిబిదనూరు మండలం మణిపాల గ్రామానికి చెందిన శివప్పతో ప్రేమలో పడ్డారు. అతనితో కలిసి కొంతకాలం సహజీవనం చేశారు. ఆ సమయంలోఆమె తన పేరును శిల్పాగా మార్చుకున్నారు. అనారోగ్య కారణంతో శివప్ప మరణించడంతో ఆమె ఒంటరిగా నివసిస్తూ.. జీవనోపాధి కోసం ఓ గార్మెంట్స్ షాప్‌లో చేరారు.

పాడుబడిన వ్యవసాయ బావిలో
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుల్జార్ బాను, ఫయాజ్ ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. సహజీవనం చేసినట్లు తెలియడంతో తరచూ మాటలతో వేధిస్తుండే వారు. దీన్ని భరించలేక ఆమె ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో తల్లిదండ్రులు ఆగ్రహించారు. ఫయాజ్ తన సోదరుడు ప్యారేజాన్ సహకారంతో పర్వీనా బానును హత్య చేశాడు. దీనికి మృతురాలి తల్లి గుల్జార్ బాను సహకరించింది. ముగ్గురు కలిసి ఆమె మృతదేహాన్ని గౌరిబిదనూరు సమీపంలోని ఓ పాడుబడిన వ్యవసాయ బావిలో పడేశారు.

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం..
దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తమ కుమార్తె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేశారు. భర్త నుంచి విడిపోవడం, సహజీవనం చేసిన శివప్ప అనారోగ్య కారణంతో మరణించడం వంటి కారణాలతో జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడిందని గుల్జార్ బాను, ఫయాజ్ స్థానికులను నమ్మించారు. పోస్ట మార్టమ్ రిపోర్ట్ తల్లిదండ్రుల ఘాతుకాన్ని బయటపెట్టింది. పర్వీనా బాను బావిలో దూకి మరణించలేదని, ఊపిరి ఆడకపోవడమే ఆమె చావుకు కారణమైనట్లు డాక్టర్లు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో పొందుపరిచారు.

గొంతు నులిమి
గొంతు నులిమినట్లుగా ఆనవాళ్లు లభించడంతో పోలీసులు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించారు. తమదైన స్టైల్‌లో విచారించడంతో నిందితులు తమ ఘాతుకాన్ని అంగీకరించారు. తామే హత్య చేసినట్లు చెప్పారు. భర్త నుంచి విడిపోయిన తరువాత అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడం వల్ల తమ పరువు పోయిందని, ఆ అక్కసుతోనే పర్వీన్‌ను హత్య చేసినట్లు అంగీకరించారని తెలిపారు. తల్లిదండ్రులతో పాటు ఈ హత్యకు సహకరించిన పెదనాన్నను గౌరిబిదనూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
-
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications