election: ఎన్నికల టైమ్ లో అధికార పార్టీకి లేనిపోని సమస్యలు, రైతులతో పెట్టుకుంటే?

ఎన్నికల టైమ్ లో అధికార పార్టీకి ఇబ్బందులు వస్తే వాళ్లు తలలు పట్టుకోవడం తెలిసిందే. అయితే రైతులు నుంచి ఆరోపణలు వస్తే ఇక అధికార పార్టీకి లేనిపోని సమస్యలు వస్తాయి.

బెంగళూరు/బాగల్ కోటే: ఎన్నికల టైమ్ లో అధికార పార్టీకి ఇబ్బందులు వస్తే వాళ్లు తలలు పట్టుకోవడం తెలిసిందే. అయితే రైతులు నుంచి ఆరోపణలు వస్తే ఇక అధికార పార్టీకి లేనిపోని సమస్యలు వస్తాయి. రైతుల నుంచి అధికార పార్టీ మీద విమర్శలు వస్తే ఇక ప్రతిపక్షాల చేతికి మంచి అస్త్రం చిక్కినట్లు అవుతుంది. ఇప్పుడు అదే సీన్ ఎదురైయ్యింది.

పొలాల్లో మోటారు కేబుల్ దొంగల బెడద ఎక్కువకావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు దొంగల బెడదను అరికట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలోని ఘటప్రభ నది ఒడ్డున ఉన్న పంపుసెట్ మోటార్ కేబుల్స్ గత రెండు నెలలుగా చోరీకి గురవుతున్నాయి. రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

గతంలో అప్పులు చేసి బోర్లు వేసి పంటలు పెట్టిన రైతులు నష్టపోయారు. ఇప్పుడు నదిలో మోటారు పంప్ సెట్ లు వేసి పైప్ లైన్ ద్వారా నీటిని సేకరించి పంటలు పండించి అప్పు చెల్లించాలని రైతులు అనుకుంటున్నారు. అయితే మోటారు దొంగల కారణంగా రైతుల కష్టాలు వర్ణనాతీతం అయ్యాయి. తెల్లవారుజామున మోటారు పంపు కేబుల్ చోరీకి గురికావడంతో రైతులు మరింత నష్టపోతున్నారు. విలువైన పంప్ సెట్లు, కేబుళ్లను చోరీ చేయడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీంతో రైతులకు దిక్కుతోచక పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

Karnataka: How many difficulties did the ruling party face during the assembly election time?

రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ తిరగడం లేదని, దీంతో పొలాల్లో లేని సమయంలో దొంగలు దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ రాకపోవడంతో దొంగతనాలు పెరుగుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. గత మూడేళ్లుగా ఇదే తరహాలో పంపుసెట్ మోటార్ లతో పాటు కేబుల్ చోరీ జరుగుతున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో రైతులు ఇలాంటి ఆరోపణలు చెయ్యడంతో అధికార పార్టీ బీజేపీ ఇబ్బందులకు గురి అవుతోందని సమాచారం. మరో వైపు రైతుల ఆవేదనను ప్రచారం చెయ్యాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+