Illegal relation: మహిళ మృతదేహం కోసం ఇంటి తలుపులు బద్దలు కొట్టి..: అజ్ఞాతంలో అతను

బెంగళూరు: తన భార్య మరొకరితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోందనే అనుమానం ఓ వ్యక్తిని హంతకుడిగా మార్చివేసింది. కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడా కిరాతకుడు. భార్య మృతదేహాన్ని ఇంట్లో ఉంచి, తాళం వేసి మరీ తప్పించుకుని పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడు మద్యానికి బానిస అయ్యాడని, భార్యను శంకించేవాడని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుడి పేరు మణి. అతని స్వరాష్ట్ర తమిళనాడు. జీవనోపాధి కోసం బెంగళూరుకు వచ్చిన అతను భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తోన్నాడు. హులిమావు సమీపంలోని అరకెరె బీటీఎస్ లేఅవుట్‌లో భార్య ఆశాతో కలిసి నివసిస్తోన్నాడు. మణి.. మద్యానికి బానిస. రోజూ ఫూటుగా మందు కొట్టేవాడని, భార్యతో తరచూ గొడవ పడేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. తాను పనికి వెళ్లిన సమయంలో మరెవరో ఇంటికి వచ్చి వెళ్తున్నారనే అనుమానంతో భార్యను రోజూ కొట్టేవాడని స్థానికులు తెలిపారు.

Karnataka: Man kills his wife in Bengalurus hulimavu area over illicit affair

ఆదివారం రాత్రి కూడా మణి.. తన భార్యతో గొడవపడ్డాడు. ఈ సందర్భంగా కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి.. పరారయ్యాడు. సోమవారం రోజంతా ఆశ కనిపించలేదు. అదే సమయంలో దుర్వాసన వెలువడంతో అదే రోజు రాత్రి చుట్టుపక్కల వారు బలవంతంగా అతని ఇంటి కిటికీ తెరిచి చూడగా.. ఆశ నిర్జీవంగా కనిపించింది. దీనితో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు పగులగొట్టి ఆశా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు మణి కోసం రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు హులిమావు పోలీసులు తెలిపారు. అతను తమిళనాడుకు పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తోన్నారు. ఒక టీమ్‌ను తమిళనాడులోని నిందితుడి స్వస్థలానికి పంపించనున్నట్లు చెప్పారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+