Minister: నేను సత్యహరిశ్చంద్రుడి లాంటోడు, స్మశానంలో కూడా ఉంటాను, అదే సీన్, బళ్లారి బ్రదర్ !

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సీనియర్ మంత్రులకు కేటాయించిన శాఖల విషయంలో లొల్లి మొదలైయ్యింది. చాలా మంది సీనియర్ మంత్రులు వారికి కేటాయించిన శాఖ విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు బహిరంగంగా వారి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కర్ణాటక సీనియర్ బీజేపీ నాయకుడు, బళ్లారి బ్రదర్స్ లో ఒక్కడైన బళ్లారి శ్రీరాములు మూడా ఆయన మనసులోని మాటను గోడ మీద దీపం పెట్టినట్లు పెట్టారు. తాను సత్యహరిశ్చంద్రుడు లాంటోడు, ఆయన ఎలా జీవించాడో తాను కూడా అలాగే జీవిస్తానని అన్నారు. తాను స్మశానంలో అయినా ఉంటాను, రాజులాగా ఉంటాను, తాను ప్రస్తుతం స్మశానంలోనే ఉన్నట్లు ఉందని అన్నారు. సీఎం బసవరాజ్ బోమ్మయ్ తనకు ఏశాఖ అప్పగించినా శక్తి వంచన లేకుండా పని చేస్తానని, బీజేపీ హైకమాండ్ చెప్పినట్లు నడుచుకుంటానని బళ్లారి శ్రీరామలు బాంబు పేల్చారు.

మంత్రి పదవులతో బేజారు

మంత్రి పదవులతో బేజారు

కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బోమ్మయ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ హైకమాండ్ తో చర్చించిన తరువాత ఆయన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆర్థిక శాఖతో పాటు కొన్ని కీలకమైన శాఖలను బసరాజ్ బోమ్మయ్ దగ్గరే పెట్టుకున్నారు. మొదటిసారి మంత్రులు అయిన వారికి కొన్ని కీలక శాఖలు అప్పగించారు.

శాఖలపై సీనియర్ మంత్రుల అసహనం

శాఖలపై సీనియర్ మంత్రుల అసహనం

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సీనియర్ మంత్రులకు కేటాయించిన శాఖల విషయంలో లొల్లి మొదలైయ్యింది. చాలా మంది సీనియర్ మంత్రులు వారికి కేటాయించిన శాఖ విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు సీనియర్లు బహిరంగంగా మాకు ఇచ్చిన శాఖలు పసలేనివని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

స్మశానంలో కూడా ఉంటాను

స్మశానంలో కూడా ఉంటాను


కర్ణాటక సీనియర్ బీజేపీ నాయకుడు, బళ్లారి బ్రదర్స్ లో ఒక్కడైన బళ్లారి శ్రీరాములు కూడా మంత్రి పదవి విషయంలో ఆయన మనసులోని మాటను గోడ మీద దీపం పెట్టినట్లు పెట్టారు. తాను సత్యహరిశ్చంద్రుడు లాంటి వాడినని, ఆయన ఎలా జీవించాడో తాను కూడా అలాగే జీవిస్తానని అన్నారు. తాను స్మశానంలో అయినా ఉంటాను, రాజులాగా అయినా ఉంటాను, తాను ప్రస్తుతం స్మశానంలోనే ఉన్నట్లు ఉందని,
ఎందుకంటే రవాణా శాఖ పూర్తి నష్టాల్లో ఉందని బళ్లారి శ్రీరాములు చెప్పారు.

నా పని నేను చేస్తాను

నా పని నేను చేస్తాను

రవాణా శాఖను లాబాల్లోకి తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తానని కర్ణాటక రవాణా శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ తనకు ఏశాఖ అప్పగించినా శక్తి వంచన లేకుండా పని చేస్తానని, బీజేపీ హైకమాండ్ చెప్పినట్లు నడుచుకుంటానని బళ్లారి శ్రీరామలు బాంబు పేల్చారు.

 మోదీ, అమిత్ షా, నడ్డా చెప్పినట్లు వింటాము

మోదీ, అమిత్ షా, నడ్డా చెప్పినట్లు వింటాము

మేము అందరూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా సారధ్యంలో ప్రజలకు సేవ చేస్తున్నామని మంత్రి శ్రీరాములు అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని బళ్లారి శ్రీరాములు చెప్పారు. మొత్తం మీద కర్ణాటకలో చాలా మంది సీనియర్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మీద గుర్రుగానే ఉన్నారు. అయితే మింగలేక కక్కలేక సైలెంట్ ఉంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి మంత్రులు అయిన నాయకులకు కీలక శాఖలు అప్పగించారని సీనియర్లు గుర్రుగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+