మాజీ సీఎం మీద మరో మాజీ సీఎం కొడుకు పోటీ ?, క్లారిటీ ఇచ్చిన అప్ప, అన్ని మాట్లాడుకున్నాము!
బెంగళూరు/మైసూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల డేట్ ఫిక్స్ అయిన తరువాత బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల లెక్కలు అటూఇటూ మారిపోతున్నాయి. మాజీ సీఎం సిద్దరామయ్య మీద మరో మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది.
అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద బీజేపీ మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు, కర్ణాటక బీజేపీ శాఖ ప్రధాన కార్యదర్శి బీవై, విజయేంద్ర పోటీ చేస్తారా ? లేదా ? అనే వియంలో పక్కా క్లారిటీ వచ్చింది. పలువురు రాజకీయ నాయకులు ఇచ్చిన వివరణ కాకుండా మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఈ విషయంలో పక్కాక్లారిటీ ఇచ్చారు.

తన కుమారుడు బీవై, విజయేంద్ర వరుణా అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడం లేదని మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప క్లారిటీ ఇచ్చారు. వరుణా నియోజక వర్గం నుంచి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోటీ చేస్తున్నారు. సిద్దరామయ్య మీద తన కుమారుడు విజయేంద్ర ఎట్టిపరిస్థితిలో పోటీ చెయ్యడని బీఎస్ యడియూరప్ప మీడియాకు చెప్పారు.
సిద్దరామయ్య మీద విజయేంద్ర పోటీ చెయ్యడానికి బీజేపీ హైకమాండ్ అంగీకరించిందని, అయితే తన కుమారుడు అక్కడి నుంచి పోటీ చెయ్యడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని బీఎస్. యడియూరప్ప అన్నారు. తనను గెలిపించిన శికారిపుర నియోజక వర్గం ప్రజలు తనను చాలాసార్లు ముఖ్యమంత్రిని చేశారని, ఆ నియోజక వర్గం ప్రజల రుణం మేము తీర్చుకోవాలని, అందుకే తన కుమారుడు విజయేంద్ర శికారిపుర నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని బీఎస్. యడియూరప్ప అన్నారు.
వరుణా నియోజక వర్గం నుంచి తన కుమారుడు విజయేంద్రను పోటీకి దింపకూడదని తాను బీజేపీ హైకమాండ్ కు మనవి చేశానని, అందుకే హైకమాండ్ కూడా ఓకే చెప్పిందని, వరుణా నియోజక వర్గంలో సిద్దరామయ్య మీద పోటీ చెయ్యడానికి బలమైన అభ్యర్థిని మేము రంగంలో దింపుతామని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు.












Click it and Unblock the Notifications