Smuggler: పాలార్ బాంబు కేసు, నిందితుడు, బెయిల్ మీద బయటకు వచ్చిన స్మగ్లర్ వీరప్పన్ ఫ్రెండ్!
బెంగళూరు/చామరాజనగర్/మైసూరు: తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలకు కంటి మీద కనుకులేకుండా చేసిన స్మగ్లర్ వీరప్పన్ పేరు చెబితే దాదాపు అందరూ టక్కున గుర్తుపడతారు. కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ తరువాత దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
వీరప్పన్ మీద హత్యలు, హత్యాయత్నాలు ,బాంబు పేలుళ్లు, లూటీలు, స్మగ్లింగ్ తో పాటు వందల కేసులు ఉన్నాయి. ఎన్నో కేసులు ఉన్న వీరప్పన్ ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. వీరప్పన్ కు అనేక రాకాలుగా సహకరించిన వారి మీద లెక్కలేనన్ని కేసులు నమోదు అయ్యాయి. వీరప్పన్ ఎన్ కౌంటర్ లో అంతం అయినా అతని అనుచరులు చాలా మంది జైల్లో ఉన్నారు.

అలాంటి వీరప్పన అనుచరుడు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. 1993లో పాలార్ బాంబు పేలుడులో చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. స్మగ్లర్ వీరప్పన్ తో పాటు అతని అనుచరుడు జ్ఞానప్రకాష్ (68), బీలేంద్రన్ (70) తదితరుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. పాలార్ బాంబు పేలుడు తరువాత జ్ఞానప్రకాష్, బీలేంద్రన్ పోలీసులకు చిక్కిపోయారు.
టాడా కోర్టు జ్ఞానప్రకాష్, బీలేంద్రన్ కు ఉరి శిక్ష విధించింది. అయితే 2015లో సుప్రీం కోర్టు నిందితులు ఇద్దరికి ఉరి శిక్షను రద్దు చేసి జీవితాంతం జైల్లో ఉండేలా యావజ్జీవ కారాగార శిక్షవిధించింది. అప్పటి నుంచి ఇద్దరు జైలు జీవితం గడుపుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం బీలేంద్రన్ అనారోగ్యంతో మైసూరులోని కేఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
వీరప్పన్ అనుచరుడు జ్ఞానప్రకాష్ జైల్లోనే ఉన్నాడు. తీవ్రఅనారోగ్యానికి గురైన తనకు చికిత్స చేయించుకోవడానికి అవకాశం ఇవ్వాలని జ్ఞానప్రకాష్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు జ్ఞానప్రకాష్, బెయిల్ పిటీషన్ ను పరిశీలించింది. పోలీసులు కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తం చెయ్యకపోవడంతో జ్ఞానప్రకాష్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఎన్నో సంవత్సరాల నుంచి జైలు జీవితం గడుపుతున్న వీరప్పన్ అనుచరుడు జ్ఞానప్రకాష్ బెయిల్ మీద బయటకు వచ్చి చికిత్స చేయించుకోవడానికి సిద్దం అయ్యాడు.












Click it and Unblock the Notifications