Support: కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చిన మాజీ ప్రధాని, మాజీ సీఎం, రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు దారిలో జేడీఎస్!

బెంగళూరు/ న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీతో కలిసి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన హెచ్ డీ. కుమారస్వామి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ, కుమారస్వామి ఊహించని షాక్ ఇచ్చారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు సైతం జేడీఎస్ నిర్ణయంతో హడలిపోయాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ, మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి నిర్ణయించారని జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు.

మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాన మంత్రి హోదాలో అప్పట్లో దేవేగౌడ పోరాటం చేశారని, అందుకే తాము పార్టీలు పక్కన పెట్టి రాష్ట్రపతి అభ్యర్థి ద్రోపది ముర్ముకు మద్దతు ఇస్తున్నామని జేడీఎస్ పార్టీ సీనియర్ నేత బండప్ప కాశంపూర్ అంటున్నారు. ఇటీవల బెంగళూరు వచ్చిన ద్రౌపది ముర్ము మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ, మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామిని కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో తనకకు మద్దతు ఇవ్వాలని మనవి చేశారు.

ఆరోజు పరిస్థితి ఇది

ఆరోజు పరిస్థితి ఇది

కర్ణాటకలో గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఏ పార్టీకి సంపూర్ణ మెజారీ రాలేదు. బీజేపీ ఎక్కువ ఎమ్మెల్యే సీట్లలో విజయం సాధించినా తరువాత పరిస్థితి తారుమారైయ్యింది. కాంగ్రెస్, జేడీఎస్ పాటు కొందరు స్వతంత్ర పార్టీల ఎమ్మెల్యేలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. జేడీఎస్ లీడర్ హెచ్.డీ. కుమారస్వామి అప్పట్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎం అయ్యారు.

నానా హంగామా చేసిన కాంగ్రెస్, జేడీఎస్

నానా హంగామా చేసిన కాంగ్రెస్, జేడీఎస్

కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ నాయకులు కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్ డీ. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి బీజేపీని వ్యతిరేకించే పార్టీల నాయకులు అందరిని ఆహ్వానించారు. బెంగళూరులో విధాన సౌధ దగ్గర జరిగిన ఆ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని హెచ్. డీ. దేవేగౌడ, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు హాజరైనారు.

కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చిన జేడీఎస్

కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చిన జేడీఎస్

కొంతకాలం తరువాత కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన బీఎస్. యడియూరప్ప బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు. బీఎస్, యడియూరప్ప రాజీనామా చెయ్యడంతో ఇప్పుడు బసవరాజ్ బోమ్మయ్ సీఎంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి అప్పట్లో ముఖ్యమంత్రి అయిన హెచ్ డీ. కుమారస్వామి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు.

షాక్ ఇచ్చిన మాజీ ప్రధాని

షాక్ ఇచ్చిన మాజీ ప్రధాని

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి భారత మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ, కుమారస్వామి ఊహించని షాక్ ఇచ్చారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు సైతం జేడీఎస్ నిర్ణయంతో హడలిపోయాయి.

ద్రౌపది ముర్ముకు జేడీఎస్ జై

ద్రౌపది ముర్ముకు జేడీఎస్ జై

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ, మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి నిర్ణయించారని జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాన మంత్రి హోదాలో అప్పట్లో దేవేగౌడ పోరాటం చేశారని, అందుకే తాము పార్టీలు పక్కన పెట్టి రాష్ట్రపతి అభ్యర్థి ద్రోపది ముర్ముకు మద్దతు ఇస్తున్నామని జేడీఎస్ పార్టీ సీనియర్ నేత బండప్ప కాశంపూర్ అంటున్నారు.

జేడీఎస్ డిసైడ్ అయ్యింది

జేడీఎస్ డిసైడ్ అయ్యింది

శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫ్ రెన్స్ లో జేడీఎస్ శాసన సభ్యుల సమావేశం నిర్వహించిన తరువాత జేడీఎస్ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల బెంగళూరు వచ్చిన ద్రౌపది ముర్ము మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ, మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామిని కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో తనకకు మద్దతు ఇవ్వాలని మనవి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చూపించిన దారిలోనే ఇప్పుడు కర్ణాటకలో ప్రతిపక్షంలో ఉన్న జేడీఎస్ ముందుకు వెలుతోందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+