బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Scam: ఎస్ఐ ఉద్యోగాలు ఫర్ సేల్, ఆ స్కామ్ లో పొలిటికల్ లీడర్ కు ఈడీ అధికారులు జర్క్, మ్యాటర్ అంతే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ కర్ణాటక వ్యాప్తంగా కలకలం రేపింది. ఎస్ఐ ఉద్యోగాల నియామకం స్కామ్ కేసు సీఐడీ అధికారుులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్. డీ. పాటిల్ నివాసంపై ఈడీ అధికారులు గురువారం దాడులు చేశారు. ఉదయం నుంచి ఆర్ డీ పాటిల్ నివాసంలో సోదాలు చేసిన అధికారులు పలు పత్రాలు పరిశీలించి వివరాలు సేకరించారు

climax: అక్కతో అక్రమ సంబంధం, బావమరిదిని బావ ఏం చేశాడంటే ?,రాజీకి పిలిచి ?, క్లైమాక్స్ లో ట్విస్ట్!climax: అక్కతో అక్రమ సంబంధం, బావమరిదిని బావ ఏం చేశాడంటే ?,రాజీకి పిలిచి ?, క్లైమాక్స్ లో ట్విస్ట్!

ఎస్ఐ ఉద్యోగాల నియామకం కుంభకోణంలో రూ. వందల కోట్లు రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కలబురగి నగర్‌లోని అక్కమహాదేవి కాలనీలో ఆర్. డీ. పాటిల్ నివాసంపై ఈడీ అధికారులు దాడులు చెయ్యడం కలకలం రేపింది. ఎస్ఐ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో నిందితులుగా ఉన్న డీవైఎస్పీ శాంతకుమార్‌పై బెంగళూరులోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

Scam: The ED officials who entered the SI jobs recruitment scam in Karnataka, the officials who shocked the political leader

ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ పరీక్షలు రాసిన అభ్యర్థుల నుంచి మధ్య దళారుల ద్వారా డబ్బులు అందుకున్నట్లు సీఐడీ విచారణలో తేలింది. దీంతో మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.ఈ ఎస్ఐ ఉద్యోగాల నియమాకం కుంభకోణానికి సంబంధించి బెంగళూరు హైగ్రౌండ్స్ స్టేషన్‌లో ఇప్పటికే పలు సెక్షల కింద కేసు నమోదైంది.

mother: కన్న తల్లికి తుపాకితో కాల్చి చంపేసిన కొడుకు, కుర్చీలో కుర్చుని ఫోన్, తండ్రికి ముగ్గురు భార్యలు!mother: కన్న తల్లికి తుపాకితో కాల్చి చంపేసిన కొడుకు, కుర్చీలో కుర్చుని ఫోన్, తండ్రికి ముగ్గురు భార్యలు!

ఈకేసులో రూ.3.11 కోట్లు. అక్రమ నగదు బదిలీ జరిగినట్లు సీఐడీ అధికారులు ప్రస్తావించారు. ఎస్ఐ ఉద్యోగాల నియామకంలో రిక్రూట్‌మెంట్ విభాగం ఏడీజీపీగా ఉన్న అమృత్ పాల్‌కు రూ.1.5 కోట్లు. డబ్బులు చెల్లించారని ఆరోపించారు.

ఈ స్కామ్‌లో లంచం లావాదేవీల నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ ల ఆధారంగా నిందితులు ఏ మూల నుంచి ఎవరి నుంచి డబ్బులు వసూలు చేశారు? అనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాదరహళ్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ కె. హరీష్‌కు కర్ణాటక హైకోర్టు బుధవారం బెయిల్ నిరాకరించింది.

English summary
Scam: The ED officials who entered the SI jobs recruitment scam in karnataka, the officials who shocked the political leader
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X