మా సీఎంను ఎవ్వరూ టచ్ చెయ్యలేరు, సింగుపూర్ లేదు చింతకాయి లేదు, షాక్!
బెంగళూరు/హాసన్: ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సింగపూర్‌లో భారీగా కుట్రలు పన్నుతున్నారనే వార్తలు జోరుగా ప్రచారం జరగడంతో ఇప్పుడు కర్ణాటకలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయంపై హాసన్ జిల్లాలోని డీఎం కుర్కె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కేఎం శివలింగేగౌడ్ స్పందించారు. సింగపూర్ లేదు, చింతకాయి లేదు, ఎవరూ ఎక్కడికీ వెళ్లారో ఎవరికి తెలుసని వ్యంగంగా అన్నారు.
135 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు, మేము సమస్యల పరిష్కారాలను మాత్రమే ప్రశ్నిస్తామని, కుళ్లు రాజకీయాలు చెయ్యలేమని శివలింగేగౌడ అన్నారు. కర్ణాటక ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రి చేయకపోవడంతో బీకే. హరిప్రసాద్ ఆయన కష్టాలను సమాజం ముందు బట్టబయలు చేశారని, ఎప్పుడు ఎవరిని ఏం చేయాలో, ఏం చెయ్యకూడదు అనే విషయం ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు బాగా తెలుసునని ఆయన అన్నారు.

సిద్ధరామయ్యను ఎమ్మెల్యేలు ఎందుకు వదులుకుంటారు చెప్పండి అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో అలాంటి పరిస్థితి రాలేదు. సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం బండరాయి లాంటిది, దానిని ఎవరూ కదిలించలేరని, ఆయన గడుపు అయిపోయేంత వరకు సీఎంగానే ఉంటారని, ఆయన్ను ఎవ్వరు కదిలించలేరని. కనీసం ఆయన్ను తాకలేమని శివలింగేగౌడ చెప్పారు.
అలాగే మీరు ఐదు హామీలు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. అయితే ఇచ్చిన ఉచిత గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, ఇప్పుడైనా ప్రతిపక్షాలు విమర్శించడం మానుకోవాలని, ఇప్పటికే బడ్జెట్ సీఎం సిద్దరామయ్య నిధులు కేటాయించారని శివలింగేగౌడ అన్నారు. సిద్ధరామయ్య సీఎంగా ఐదు ఏళ్లు ఉంటారా అన్న మీడియా ప్రశ్నకు శివలింగేగౌడ స్పందిస్తూ ఆ విషయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని, సిద్ధరామయ్య అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్న అసలు విషయం తనకు తెలియదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications