బలవంతం వసూళ్లు చేస్తే తోలు తీసేస్తాం, 112కు ఫోన్ చెయ్యండి, సిటీ బాస్
వినాయక చవితి సందర్బంగా భారతదేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు అనే విషయం తెలిసిందే. వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చెయ్యడానికి కొందరు సొంత డబ్బులు ఖర్చు చేస్తారు. అయితే ఎక్కువ శాతం మంది స్థానిక ప్రజల నుంచి చందాలు వసూలు చేసి వినాయక చవితి సందర్బంగా వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారు.
ఐటీ హబ్ బెంగళూరు నగరంలో వినాయక చవితి పండుగ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపనకు సంబంధించి ప్రజల నుంచి బలవంతంగా చందాలు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద హెచ్చరించారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ దయానంద్ బలవంతంగా చందాలు వసూలు చేసే వారికి నేరుగా వార్నింగ్ ఇచ్చారు.

వినాయక చవితి పండుగ సందర్భంగా పలు సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7వ తేదీన బెంగళూరు నగరంలో కొన్ని రోజులు వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి ఊరేగిస్తారు. వినాయకుడి విగ్రహాల ప్రతిష్ఠాపన సాకుతో బలవంతంగా చందాలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ దమానంద్ హెచ్చరించారు. స్వచ్ఛందంగా ఎవరైనా చందాలు ఇస్తే మాత్రమే తీసుకోవాలని దయానంద్ చెప్పారు.
ఎవరైనా స్థానికుల నుంచి
బలవంతం చందాలు వసూలు చేస్తే 112 హెల్ప్‌లైన్, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ దయానంద్ ప్రజలను కోరారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, బీబీఎంపీ, సిటీ పోలీసులతో కలిసి ఓ శాంతి సమావేశం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో వినాయకుడి విగ్రహాల ప్రతిష్ఠాపనకు అనుమతి తీసుకోవడానికి బీబీఎంపీ పలు కేంద్రాలను ప్రారంభించింది. ప్రతి కేంద్రానికి ఒక పోలీసు అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీలు, నిర్వాహకులకు 21 ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు జారీ చేసిన ఆదేశాలను అందరూ కచ్చితంగా పాటించాలని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర దయానంద్ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications