బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Superstar: బెంగళూరులో తలైవా, సీక్రెట్ గా ఫ్యామిలీతో చర్చలు, పొలిటికల్ ఎంట్రీ, మీడియాకు దూరం, ఎందుకో?!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సిద్దం అయిన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా ఐటీ, బీటీ హబ్ బెంగళూరులో ప్రత్యక్షం అయ్యారు. బెంగళూరు పెరిగి ఓ ఇంటి వాడైన రజనీకాంత్ తరువాత చెన్నైలో అడుగుపెట్టి ఏకంగా సూపర్ స్టార్ అయిపోయారు. రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల పక్కా క్లారిటీ ఇచ్చిన తలైవా రజనీకాంత్ బెంగళూరు చేరుకుని సొంత సోదరుడు సత్యనారాయణ ఫ్యామిలీతో పాటు ఆయన సన్నిహితులతో మంతనాలు జరిపారు. బెంగళూరు రహస్యంగా వచ్చిన తలైవా మీడియాను దూరం పెట్టడం చర్చకు దారితీసింది.

Sadist: పెళ్లి కొడుక్కి బెంజ్ కారు, 5 కేజీ బంగారు, ఫస్ట్ నైట్ భరత్ రెడ్డి ఏం చేశాడంటే ? శోభనం చెట్టెక్కింది, కథ!Sadist: పెళ్లి కొడుక్కి బెంజ్ కారు, 5 కేజీ బంగారు, ఫస్ట్ నైట్ భరత్ రెడ్డి ఏం చేశాడంటే ? శోభనం చెట్టెక్కింది, కథ!

బెంగళూరులో సొంత సోదరుడు

బెంగళూరులో సొంత సోదరుడు

సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. తమిళ సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా ఓ వెలుగు వెలుగుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ సొంత సోదరుడు సత్యనారాయణ మాత్రం బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. రజనీకాంత్ సూపర్ స్టార్ కాక ముందు ఆయన్ను ఆయన సోదరుడు సత్యనారాయణ అన్ని రకాలుగా ఆదుకున్నారు.

అందరికీ షాక్

అందరికీ షాక్

డిసెంబర్ 6వ తేదీ ఆదివారం రాత్రి సూపర్ స్టార్ రజనీకాంత్ ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరు చేరుకున్నారు. అనంతరం సన్నిహితుడి కారులో రజనీకాంత్ బెంగళూరులోని ఆయన సొంత సోదరుడు సత్యనారాయణ నివాసం ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. అనంతరం కుటుంబ విషయాలతో పాటు రాజకీయంగా తీసుకోవలసిన నిర్ణయాల విషయంలో రజనీకాంత్ ఆయన సోదరుడు సత్యనారాయణతో చర్చించారని తెలిసింది.

డిసెంబర్ 3, డిసెంబర్ 31కి లింక్

డిసెంబర్ 3, డిసెంబర్ 31కి లింక్

2018 డిసెంబర్ 31వ తేదీన తాను రాజకీయాల్లోకి వస్తానని, కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. అనంతరం రెండు సంవత్సరాల పాటు తాను రాజకీయాల్లోకి వస్తాను అంటూ నాన్చుతూ వచ్చిన రజనీకాంత్ 2020 డిసెంబర్ 3వ తేదీన తాను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని ట్వీట్ చేశారు. రజనీకాంత్ రంగప్రవేశంపై క్లారిటీ రావడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు సంబరాలు చేసుకుంటున్నారు.

అన్నదమ్ముల చర్చలు

అన్నదమ్ముల చర్చలు

డిసెంబర్ 31వ తేదీన తన రాజకీయ ఎంట్రీ విషయాల గురించి, పార్టీ పేరు ప్రకటిస్తానని రజనీకాంత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. 2021లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జనవరి నెలలో అధికారికంగా రాజకీయ కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని రజనీకాంత్ ఇప్పటికే పక్కాక్లారిటీ ఇచ్చారు. ఇలాంటి సమయంలో బెంగళూరులోని పెద్దన్న సత్యనారాయణతో రజనీకాంత్ భేటీ కావడం ప్రధాన్యత ఏర్పడింది.

Recommended Video

Rajinikanth Party Arrives In January | Oneindia Telugu
సంచలనాలకు కేరాఫ్ రజనీకాంత్

సంచలనాలకు కేరాఫ్ రజనీకాంత్

సొంత సోదరుడు సత్యనారాయణతో పాటు రజనీకాంత్ బెంగళూరులోని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులతో భేటీ అయ్యారు. అయితే మీడియాకు ఏమాత్రం లీక్ కాకుండా రజనీకాంత్, ఆయన సోదరుడు సత్యనారాయణ జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం మీద సినీ రంగంలో సంచలనాలు సృష్టించిన రజనీకాంత్ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు కేంద్ర బింధువు అవుతారో వేచి చూడాలి.

English summary
Superstar Rajinikanth Visited His Brother Satyanarayana's House In Bengaluru And took his blessings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X