బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Supreme Court: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు, సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏడీజీపీ, బెంగళూరు కలెక్టర్, ఏసీబీ!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: బెంగళూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లంచం కేసు వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. బెంగళూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ అరెస్టు అయిన డిప్యూటీ తహసిల్దార్ మహేష్ తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టును ఆశ్రయించారు. కేసు వివరాలు తెలుసుకున్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందేష్ కర్ణాటక ఏసీబీ ఏడీజీపీ సీమంత్ కుమార్ సింగ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏడీజీపీ సీమంత్ కుమార్ సింగ్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఆయన ఏసీబీని ఏమి ఉద్దరిస్తారు అని ప్రశ్నించారు. తనను బదిలి చేస్తారని కొందరు బెదిరిస్తున్నారని, అలాంటి బెదిరింపులకు తాను తల వంచను అని న్యాయమూర్తి జస్టిస్ సందేష్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటక న్యాయమూర్తి జస్టిస్ సందేష్ వ్యాఖ్యలతో ఏసీబీ ఏడీజీపీ సీమంత్ కుమార్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Escape: ఎయిర్ పోర్టులో శ్రీలంక మాజీ మంత్రికి సినిమా, భార్యతో మిలటరి స్థావరంలో, దుబాయ్ జంప్ కు స్కెచ్!Escape: ఎయిర్ పోర్టులో శ్రీలంక మాజీ మంత్రికి సినిమా, భార్యతో మిలటరి స్థావరంలో, దుబాయ్ జంప్ కు స్కెచ్!

బెంగళూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో?

బెంగళూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో?

భూమి వివాదం పరిష్కరించడానికి బెంగళూరు జిల్లా కలెక్టర్ మంజునాథ్ లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులు ఇటీవల దాడులు చేశారు. రూ. 5 లక్షల లంచం కేసులో బెంగళూరు జిల్లా కలెక్టర్ మంజునాథ్ తో పాటు అదే కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ గా ఉద్యోగం చేస్తున్న మహేష్ ను కర్ణాటక ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

బెయిల్ కోసం ప్రయత్నించిన మహేష్

బెయిల్ కోసం ప్రయత్నించిన మహేష్

బెంగళూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ అరెస్టు అయిన డిప్యూటీ తహసిల్దార్ మహేష్ తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని కర్ణాటక హై కోర్టును ఆశ్రయించారు. కేసు వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి జస్టిస్ సందేష్ కర్ణాటక ఏసీబీ ఏడీజీపీ సీమంత్ కుమార్ సింగ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

బళ్లారి అక్రమ మైనింగ్ కేసు ఏమైయ్యింది?

బళ్లారి అక్రమ మైనింగ్ కేసు ఏమైయ్యింది?

బళ్లారి అక్రమ మైనింగ్ వ్యవహాయం బయటకు వచ్చిన సమయంలో ఇప్పటి ఏసీబీ ఏడీజీపీ సీమంత్ కుమార్ సింగ్ బళ్లారిలో పని చేశారని, ఆయనకు ముడుపులు అందాయి అని అప్పట్లో ఆరోపణలు వచ్చాయని న్యాయమూర్తి జస్టిస్ సందేష్ గుర్తు చేశారు. ఆ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో తమముందు హాజరై వివరణ ఇవ్వాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందేష్ సూచించారు.

సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏడీజీపీ

సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏడీజీపీ

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందేష్ తన గురించి పరిమితులు దాటి మాట్లాడుతున్నారని, మీరే న్యాయం చెయ్యాలని ఏసీబీ ఏడీజీపీ సీమంత్ కుమార్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మంగళవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ముందు పిటిషన్ విచారణకు వచ్చింది. ఇటీవల మీడియాలో వచ్చిన వివరాలు, ఈకేసు రెండు ఒక్కటేనా అని సుప్రీం కోర్టు సీజే జస్టిస్ ఎన్.వి. రమణ అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక న్యాయమూర్తి చేసిన ఆరోపణలు, ఏడీజీపీ సీమంత్ కుమార్ సింగ్ పిటిషన్ ఒక్కటే అతని తెలుసుకున్న సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చెయ్యడానికి అంగీకరించింది.

English summary
Supreme Court: Karnataka ACB ADGP Semanthkumar Singh moves to SC against Karnataka High Court Judge H P Sandesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X