సీఎం సిద్దరామయ్య మీద పరువు నష్టం కేసు, ప్రత్యేక కోర్టు ఏం చెప్పిందంటే?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. కర్ణాటక రాజకీయ నాయకులతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఒక పార్టీ మీద మరో పార్టీ నాయకులు విమర్శలు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్బంగా కర్ణాటకలోని లింగాయత్ కులానికి చెందిన ముఖ్యమంత్రులు అవినీతి పరులు అని సిద్దరామయ్య విమర్శలు చెయ్యడంతో ఆయన మీద పరువు నష్టం దావా వేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని లింగాయత్ ముఖ్యమంత్రులు (లింగాయత్ సీఎంలు) అవినీతికి పాల్పడ్డారంటూ తీవ్రవ్యాఖ్యలుచేశారని ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పరువు నష్టం కేసు నమోదైంది. దీనిపై విచారించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం పరువునష్టం దావా పిటిషన్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

లింగాయత్ సీఎంలు అవినీతిపరులంటూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యల కేసులో కర్ణాటక ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పెద్ద ఊరటనిచ్చింది. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేతగా ఉన్న సిద్ధరామయ్య ఆ రాష్ట్రంలోని లింగాయత్ సీఎంలు అవినీతిపరులంటూ వ్యాఖ్యలు చెయ్యడంతో వివాదానికి తెర లేచింది.
అప్పటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న సిద్దరామయ్య మీద పరువు నష్టం కేసు పెట్టారు. అయితే కర్ణాటక ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిద్దరామయ్య మీద నమోదు అయిన పరువు నష్టం దావా పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై దాఖలైన పరువునష్టం కేసు కొట్టివేయడంతో ఆయనకు పెద్ద ఊరట లభించినట్లు అయ్యింది.. సిద్ధరామయ్యపై శంకర్ షేట్, మల్లయ్య హిరేమఠ్ అనే ఇద్దరు పరువు నష్టం కేసులు వేశారు. దీనిపై ప్రత్యేక న్యాయస్థానం విచారించి పరువు నష్టం దావా కేసులు కొట్టివేసింది.












Click it and Unblock the Notifications