Wife: పెళ్లాం ఎఫెక్ట్, ఇద్దరు ఆంటీలతో ఎంజాయ్, డ్రగ్స్ కేసు కింగ్ పిన్, చచ్చినోడు మళ్లీ జైల్లోకి !

బెంగళూరు/ హైదరాబాద్: డ్రగ్స్ కేసులో జైలుపాలై ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చిన డ్రగ్స్ కేసు కింగ్ పిన్ మరోసారి జైలుపాలైనాడు. అమాయకులతో గేమ్స్ ఆడిన కిలాడీ ఆంటీల వ్యామోహంతో ఇప్పుడు పెళ్లాంతోనే పెట్టుకున్నాడు. తాగిన మైకంలో, డ్రగ్స్ కు బానిస అయిన మొగుడు పెళ్లాంతో పెట్టుకుని కటకటాలపాలైనాడు. బెంగళూరు, హైదరాబాద్, ముంబాయి తదితర నగరాల్లో మస్త్ మజా చేస్తూ డ్రగ్స్ పార్టీలు నిర్వహించిన కేటుగాడు ఇప్పుడు ఆంటీల అక్రమ సంబంధాల కారణంగా భార్యతో గొడవ పెట్టుకుని లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నాడు.

 స్యాండిల్ వుడ్ లో కలకలం

స్యాండిల్ వుడ్ లో కలకలం

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసు కరోనా (COVID-19) కాలంలో కూడా కలకం రేపింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో స్యాండిల్ వుడ్ బ్యూటీస్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ తదితరులు జైలుపాలైనారు. ఇదే బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీతో పాటు కొందరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు జైలుకు వెళ్లారు.

 కింగ్ పిన్ జైన్ అందర్

కింగ్ పిన్ జైన్ అందర్

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో బెంగళూరులోని మల్లేశ్వరంలోని వయ్యాలి కావల్ లో నివాసం ఉంటున్న వైభవ్ జైన్ కూడా అరెస్టు అయ్యి జైలుపాలైనాడు. బెంగళూరు డ్రగ్స్ కేసులో వైభవ్ జైన్ కింగ్ పిన్ అని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) విచారణలో వెలుగు చూసింది.

హమ్మయ్యా..... బెయిల్ వచ్చేసింది

హమ్మయ్యా..... బెయిల్ వచ్చేసింది


బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో మొదట నటి సంజనా గల్రానీ, తరువాత హనీబ్యూటీ రాగిణి ద్వివేది బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇదే కేసులో అనేక మంది అరెస్టు కావడం, జైలు నుంచి బయటకు రావడం జరిగింది. బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన వైభవ్ జైన్ ఫిబ్రవరి 9వ తేదీ బెయిల్ మీద బయటకు వచ్చాడు.

వచ్చినాడు...... మళ్లీ జైలుకు చచ్చినోడు

వచ్చినాడు...... మళ్లీ జైలుకు చచ్చినోడు

బెయిల్ మీద బయటకు వచ్చిన రెండు మూడు రోజులు వైభవ్ జైన్ చచ్చిన పేనులాగా ఇంట్లో ఉన్నాడు. తరువాత ఫిబ్రవరి 12వ తేదీ నుంచి వైభవ్ జైన్ అతని ప్రతాపం భార్య పూజాగాంధీ మీద చూపించాడు. భార్య పూజాగాంధీ, పిల్లను తన్ని బయటకు తరిమేశాడు. నువ్వు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం సాగిస్తున్నావని, అందుకే నన్ను జైల్లో పెట్టించి కనీసం బెయిల్ కూడా ఇప్పించలేదని వైభవ్ జైన్ భార్య పూజాగాంధీని చితకబాదేశాడని ఆరోపణలు ఉన్నాయి.

 నా మొగుడికి గీతా, భిందు కీప్స్

నా మొగుడికి గీతా, భిందు కీప్స్

తన భర్త వైభవ్ జైన్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడని, అతను మల్లేశ్వరంలో వ్యాపారాలు చేస్తూ గీతా, భిందు అనే ఇద్దరు మహిళలతో అక్రమ సంబందం పెట్టుకున్నాడని, నిత్యం తనను, తన పిల్లలను ఇంటి నుంచి వెళ్లిపోవాలని వేధింపులకు గురి చేస్తున్ననాడని ఆరోపిస్తూ పూజాగాంధీ వయ్యాలికావల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జైన్ కు జజ్జనకజనారే

జైన్ కు జజ్జనకజనారే

పూజాగాంధీ ఫిర్యాదుతో వయ్యాలికావెల్ పోలీసులు వైభవ్ జైన్ ను అరెస్టు చేసి మళ్లీ జైలుకు పంపించారు. గత ఏడాది (2020)లోనే తన భర్త వైభవ్ జైన్ వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను వైధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ పూజాగాంధీ పోలీసు కేసు పెట్టడంతో అయ్యగారు ఒకసారి అరెస్టు అయ్యారు. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన నాలుగు రోజులకే మళ్లీ భార్య పూజాగాంధీ మీద తన ప్రతాపం చూపించిన వైభవ్ జైన్ మరోసారి జైలుపాలైనాడు.

రూ. లక్షల్లో ఆధాయం

రూ. లక్షల్లో ఆధాయం

ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వైభవ్ జైన్ డ్రగ్స్ విక్రయించే వారితో లింక్ లు పెట్టుకుని బెంగళూరు. హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీ తదితర నగరాల్లో అతని లావాదేవీలు నిర్వహించాడని ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ అని అరెస్టు అయిన వైభవ్ జైన్ డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తూ లక్షల రూపాయలు సంపాధిస్తున్నాడని పోలీసులు అంటున్నారు. ఒక పక్క ఫైనాన్స్ వ్యాపారం, మరో వైపు డ్రగ్స్ దందాతో విచ్చలవిడిగా సంపాధించిన వైభవ్ జైన్ పెళ్లాం దెబ్బతో మరోసారి జైలుపాలైనాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+