రూ.లక్షకు రూ.2.50 లక్షల లాభం.. స్టాక్ కోసం ఎగబడుతున్న జనం
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేముందు ఈ స్టాక్ గురించి తెలుసుకుని వాచ్ లిస్టులో చేర్చుకోమని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ మారుతీ లిమిటెడ్ (Bharat Maruti Limited). ఈ కంపెనీ 1983లో ఏర్పాటైంది. ముఖ్యమైన ఆటోమోటివ్ కంపోనెంట్స్, ప్యాసెంజర్ కార్ల విడిభాగాలు తయారు చేస్తుంటుంది. మారుతీ సుజుకీ ఇండియా భాగస్వామ్యంతో ఎగ్జాస్ట్ సిస్టమ్స్, ఫ్యూయల్ ఫిల్లర్స్, సస్పెన్స్ పార్ట్స్‌లో ఈ కంపెనీ పేరుతెచ్చుకుంది.
గురగావూన్, బవాల్, మనేసర్ (హరియాణా), గుజరాత్‌లో సంబంధిత కంపెనీ పరిశ్రమలున్నాయి. హర్యానా, గుజరాత్‌లో రెండు కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మారుతీ సుజుకీ అవసరాలను తీర్చేందుకు అవి ఉపయోగపడతాయని భావిస్తోంది. రూ.300-350 కోట్ల మధ్యలో పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

సంవత్సర కాలంలో ఈ మల్టీబ్యాగర్ షేరు 81.6 శాతం పెరిగింది. మూడు సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు 144 శాతం రిటర్న్స్ వచ్చాయి. సెల్స్ గ్రోత్ 12 శాతం పెరిగింది (3 ఏళ్లు). అలాగే కంపెనీ లాభం కూడా 8 శాతం, డివిడెండ్ ఈల్డ్ 0.58 శాతం పెరిగాయి. ఈ కంపెనీ షేర్లలో మూడు సంవత్సరాల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు వాటి విలువ రూ.2.44 లక్షలుగా ఉంది.
సంవత్సరం క్రితం రూ.1 లక్ష పెట్టినట్లయితే ఇప్పుడు రూ.1.81 లక్షలుగా ఉంది. జూన్ 14వ తేదీన జరిగిన ట్రేడింగ్‌లో భారత మారుతీ కంపెనీ షేరు 10.43 శాతం పెరిగింది. సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.233.70ని తాకింది. షేర్ల వాల్యూమ్ 1.01 టైమ్స్ పెరిగింది. ఈ కంపెనీ షేర్లను వాచ్ లిస్టులో చేర్చుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications