Mukesh Ambani: వామ్మో.. ఉద్యోగికి ఖరీదైన గిఫ్డ్ ఇచ్చిన ముఖేష్ అంబానీ రూ.1,500 కోట్లు..!
Mukesh Ambani: దేశంలోని దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఏం చేసినా గ్రాండ్ గానే ఉంటుంది. అవును ఎంతో ఆడంబరంగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఈ బిలియనీర్ తాజాగా ఒకరికి రూ.1,500 కోట్ల విలువైన ఇంటిని ఒక వ్యక్తికి బహుమతిగా ఇచ్చారు. అసలు ఆ వ్యక్తి ఎవరు..? అంబానీకి ఏమౌతారు..? ఎందుకు ఈ గిఫ్డ్ ఇచ్చారో చూద్దాం..
ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో విశ్వసనీయ ఉద్యోగి మనోజ్ మోదీకి.. బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ రూ.1500 కోట్ల విలువైన బహుళ అంతస్తుల భవనాన్ని బహుకరించారు. అంబానీకి రైట్ హ్యాండ్‌గా పిలవబడే మోదీ.. రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోలో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ముంబైలోని యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో కలిసి చదువుతున్నప్పటి నుంచి మనోజ్ ముఖేష్ అంబానీకి స్నేహితుడు కూడా కావటం విశేషం.

1980 ప్రారంభంలో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ గ్రూప్ ను నడుపుతున్న సమయంలో మనోజ్ రిలయన్స్‌లో చేరారు. 2020లో ఫేస్‌బుక్‌తో జియో రూ.43,000 కోట్ల విలువైన డీల్ కుదుర్చుకోవటంతో సహా రిలయన్స్ కోసం అనేక మిలియన్ డాలర్ల డీల్‌లను విజయవంతం చేయటంలో కీలక పాత్ర పోషించారు.
అంబానీ ఇచ్చిన ఇల్లు ముంబైలోని నేపియన్ సీ రోడ్‌లో ఉంది. ప్రస్తుతం అంబానీ బహుకరించిన ఈ 22 అంతస్తుల ఇంటికి 'బృందావన్' అని పేరు పెట్టారు. ఈ భవనం మెుత్తం వైశాల్యం 1.7 లక్షల చదరపు అడుగులు. దీనిలో మెుదటి ఏడు అంతస్తులు కారు పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. దీనికి అవసరమైన కొంత ఫర్నిచర్ ను ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications