ఇండియన్ వయాగ్రా: కొత్త దంపతులకు కోహినూర్ పాన్ , స్త్రీలకు ప్రత్యేకం, ధర ఎంతంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: పాన్‌లలో అనేక రకాలుంటాయి. అయితే కొన్ని పాన్‌లు తింటే మత్తు వస్తోంది. కొన్ని పాన్‌లను భోజనం తర్వాత వేసుకొంటారు. అయితే కొత్తగా పెళ్ళైన జంటల కోసం ప్రత్యేకంగా ఓ పాన్ తయారు చేస్తుంటారు. మహరాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కోహినూర్‌ పాన్‌గా పేరు పొందింది.ఈ పాన్‌షాప్‌లో సుమారు 51 రకాల పాన్‌లు దొరుకుతాయి.ఒక్కో పాన్ ధర సుమారు 5 వేల రూపాయాలకు విక్రయిస్తారు.

పాన్‌ అంటే కొందరికి మక్కువ. భోజనం తర్వాత పాన్ తినడం అలవాటు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణ ప్రాంతాల్లో కూడ పాన్ తినే అలవాటు ఉన్న వారిని చూస్తాం.

అయితే పాన్‌ల తయారీ సమయంలో జర్ధా, సున్నంతో పాటు ఇతర పదార్ధాలను కలుపుతుంటారు. కొందరు స్వీట్ పాన్లు ఇష్టపడుతుంటారు. అయితే పాన్‌ల తయారీలో ఉపయోగించే పదార్థాలను బట్టి పాన్‌ల రుచి తెలుస్తోంది.

 కోహినూర్ పాన్‌కు రూ.5 వేలు

కోహినూర్ పాన్‌కు రూ.5 వేలు

మహారాష్ర్టలోని ఔరంగాబాద్‌లో ఐదు దశాబ్ధాల చరిత్ర కలిగిన పాన్‌ షాప్‌లో 51 రకాల పాన్‌లను విక్రయిస్తారు. అయితే ఒక పాన్‌ ధరమాత్రం రూ 5000 విక్రయిస్తారు. ఈ పాన్ కోసం కస్టమర్లు బారులుతీరుతున్నారు. కోహినూర్‌ పాన్‌గా పేరొందిన ఈ కిళ్లీ ఆ షాప్‌ ప్రత్యేకత. ఈ పాన్‌ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ తారా పాన్‌ సెంటర్‌కు క్యూకడతారు.

 ఇండియన్ వయాగ్రా

ఇండియన్ వయాగ్రా

ఇండియా వయాగ్రాగా పేరొందిన కోహినూర్‌ పాన్‌ నవ దంపతుల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఈ పాన్‌ను కిలో రూ 70 లక్షలు ధర పలికే స్పెషల్‌ కస్తూరి, కుంకుమపువ్వు , రోజ్‌ వంటి పదార్ధాలతో తయారుచేస్తారు. అయితే ఈ పాన్‌లో ఉపయోగించే కుంకుమ పువ్వు కిలోరూ 70,000, రోజ్ కిలో రూ 80,000 ధర పలుకుతోంది.

 ప్రత్యేకమైన పదార్థం పాన్‌లో కలుపుతారు

ప్రత్యేకమైన పదార్థం పాన్‌లో కలుపుతారు

కోహినూర్ పాన్‌లో ఈ కిళ్ళీ దుకాణం యజమానులు ప్రత్యేకమైన పదార్థాన్ని పాన్‌లో కలుపుతారు. దీనికి తోడు పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే లభ్యమయ్యే సువాసనలు వెదజల్లే ప్రత్యేక లిక్విడ్‌ను వాడతారు. కోహినూర్ పాన్‌లో ఉపయోగంచే ప్రత్యేకమైన పదార్ధం కేవలం షాపు యజమాని మహ్మద్‌ సిద్ధిఖి, ఆయన తల్లికి మాత్రమే ఈ పదార్ధం తెలుసు.

 తల్లి ద్వారా కొడుకుకు

తల్లి ద్వారా కొడుకుకు

సిద్ధిఖికికి ఆయన తల్లి ఈ పాన్‌ను దానిలో కలిపే రహస్య పదార్ధం గురించి తెలిపిందని స్థానికుల కథనం. సిద్దిఖీకి పైళ్ళైన తర్వాతే ఈ పాన్‌ను అమ్మడం మొదలెట్టాడు. తన తల్లి ఈ పాన్‌ను తిని బాగుంటే దాన్ని విక్రయించాలని తనకు సూచించిందని చెప్పారు. అప్పటినుంచి ఈ పాన్‌ను తన షాపు మెనూలో చేర్చానని చెబుతాడు సిద్దిఖీ.

ఆడవాళ్ళకు ప్రత్యేకమైన కోహినూర్ పాన్

ఆడవాళ్ళకు ప్రత్యేకమైన కోహినూర్ పాన్

కొత్తగా పెళ్లయిన జంటలు కోహినూర్‌ పాన్‌ను కొనేందుకు షాపు ముందు క్యూ కడుతున్నారు. పాన్‌ ధర ఎక్కువగా ఉండటంతో తక్కువ ధరకు రూ 3000కే ఈ తరహా మరో పాన్‌ను సిద్ధిఖి అందుబాటులోకి తెచ్చారు. తారా పాన్‌ సెంటర్‌లో ఇప్పుడు లేడీస్‌ స్పెషల్‌ కోహినూర్‌ పాన్‌ను సిద్ధం చేశారు. కోహినూర్‌ పాన్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన బాక్స్‌లో కస్టమర్‌కు అందించడమే కాకుండా దాంతో పాటు పెర్‌ఫ్యూమ్‌ను అందిస్తున్నారు. రోజూ 10,000 పాన్‌లను ఇక్కడ విక్రయిస్తుంటారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There’s a 50-year-old paan shop in Aurangabad, and is popular for a strange reason. Though there are 51 types of paan on the menu of the shop, one of it costs as much as Rs 5,000

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి