భలే ఛాన్స్: పెళ్లిలో సెల్‌ఫోన్లు, నోట్ల వర్షం (వీడియో)
సాధారణంగా పెళ్లికి వచ్చిన అతిథులపై పూలు, పన్నీరు చల్లుతారు. కానీ పెళ్లికి వచ్చిన వారిపై ఏకంగా సెల్‌ఫోన్లు, కరెన్సీ నోట్ల వర్షం కురిస్తే? సరిగ్గా ఇదే జరిగిందక్కడ.
ఇస్లామాబాద్: సాధారణంగా పెళ్లికి వచ్చిన అతిథులపై పూలు, పన్నీరు చల్లుతారు. ఇక వేడుకల్లో కళాకారులపై డబ్బులు వెదజల్లడం గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మామూలే. కానీ పెళ్లికి వచ్చిన వారిపై ఏకంగా సెల్‌ఫోన్లు, కరెన్సీ నోట్ల వర్షం కురిస్తే?
సరిగ్గా ఇదే జరిగిందక్కడ. దీంతో పెళ్లికొచ్చిన వారంతా అవాక్కయ్యారు. ఆనక సెల్‌ఫోన్లు, కరెన్సీ నోట్ల కోసం ఎగబడిపోయారు. ఇంతకీ ఈ పెళ్లి జరిగిందెక్కడో తెలుసా? పాకిస్తాన్‌లో.

అవును, పాకిస్తాన్ ముల్తాన్‌లోని షుజాబాద్‌కు చెందిన మొహమ్మద్ అర్షద్‌కు, పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖన్పూర్‌కు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి జరిగింది. వరుడు అర్షద్‌కు ఎనిమిది మంది అన్నయ్యలు ఉన్నారు.
వారిలో కొందరు అమెరికాలో, ఇంకొందరు సౌదీ అరేబియాలో స్థిరపడి బాగా సంపాదించారు. అందరిలోకి చిన్నవాడు, ఆఖరివాడు అర్షద్. దీంతో తమ్ముడి పెళ్లి కలకాలం అందరికీ గుర్తుండిపోవాలని అతడి అన్నలు అనుకున్నారు.
అంతే.. అతడి పెళ్లికి వచ్చిన వారందరిపై సెల్‌ఫోన్లు, డాలర్లు, రియాల్ నోట్ల వర్షం కురిపించారు. తమ పర భేదం లేకుండా పెళ్లికొచ్చిన ప్రతి ఒక్కరికీ సెల్‌ఫోన్‌గానీ, కరెన్సీ నోట్లుగానీ సొంతమయ్యాయి. పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications