ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కి.మీ.. ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ అదుర్స్!
బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ భారత మార్కెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకే ఛార్జ్‌తో ఏకంగా 400 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సంస్థ ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారిలో ప్రధానం ఉండే రేంజ్ ఆందోళనను దూరం చేసేలా సింపుల్ ఎనర్జీ తన కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. దేశంలోనే అత్యధిక రేంజ్ ఇచ్చే స్కూటర్‌గా ఇది నిలిచింది.
ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌పై ఏకంగా 400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో 6.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. భారతదేశంలో ఒక స్కూటర్‌లో ఇంత పెద్ద బ్యాటరీ అమర్చడం ఇదే మొదటిసారి. పరిశ్రమలో ముందెన్నడూ లేని విధంగా బ్యాటరీ, మోటార్‌పై లైఫ్ టైమ్ వారంటీని సంస్థ ప్రకటించింది.ఇది కేవలం 2.77 సెకన్లలోనే 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కి.మీగా ఉంది.

టెక్నాలజీ, ఇతర సదుపాయాలు:
7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 5G e-SIM, బ్లూటూత్, ఇన్-బిల్ట్ నావిగేషన్ సదుపాయం, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), పార్క్ అసిస్ట్, 35 లీటర్ల భారీ అండర్ సీట్ స్టోరేజ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
ధర, లభ్యత:
సింపుల్ వన్ జెన్ 2 (Simple One Gen 2) సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ స్కూటర్ల ధరలు సుమారు రూ.1.40 లక్షల నుంచి రూ.1.78 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. అయితే హై-ఎండ్ మోడల్ అయిన 'సింపుల్ అల్ట్రా' ధర దాదాపు రూ.2 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా.












Click it and Unblock the Notifications