Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అదానీ గ్రీన్ టాక్స్ 2025 : యువతకు ఇది రెండో స్వాతంత్య్ర సంగ్రామం !!

అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీన్ టాక్స్ సదస్సు ఈ ఏడాది నాలుగో ఎడిషన్‌కి చేరుకుంది. ఈ మేరకు "స్థిరమైన, సమ్మిళిత భవిష్యత్తు" అనే ప్రధాన లక్ష్యంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా యువ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, సామాజిక మార్పు సృష్టికర్తలు సదస్సులో పాల్గొని తమ వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించారు.

ఆలనే ఈ కార్యక్రమంలో సోషల్ ఇంపాక్ట్ అవార్డులను కూడా ప్రకటించారు. స్థిరమైన భవిష్యత్తు కోసం విప్లవాత్మక పరిష్కారాలను గుర్తించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. భారతదేశంలో సామాజిక ఆవిష్కరణలకు ప్రత్యేక వేదికగా మారిన ఈ వేడుకను అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రారంభించారు. అనంతరం యువ పారిశ్రామికవేత్తల పాత్రపై ఆయన కీలకోపన్యాసం చేశారు.

adani-groups-green-talks-2025-summit-and-speech-details

రెండో స్వాతంత్య్ర సంగ్రామం..

ఇది భారతదేశ "రెండవ స్వాతంత్య్ర సంగ్రామం" అని ఆయన ప్రస్తావించారు. ఇది విదేశీ పాలన నుండి స్వాతంత్య్రం కోసం కాకుండా.. సాంకేతికత, సామాజిక ఆవిష్కరణల ద్వారా ప్రతి సమాజాన్ని ఉన్నతంగా నిలబెట్టి, విభేదాలను తగ్గించి, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం కోసం అని వివరించారు. అలానే గ్రీన్ టాక్స్ ప్రారంభమై కేవలం నాలుగు సంవత్సరాలలోనే సమాజ గమనాన్ని మార్చగల ఆలోచనలకు ఒక కేంద్రంగా మారిందని అదానీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఇక ఈ సందర్భంగా గతంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి విజయగాథలను ఆయన గుర్తు చేసుకున్నారు. మ్యానువల్ స్కావెంజింగ్ నుండి వేలాది మందికి విముక్తి కల్పించిన జెన్‌రోబోటిక్స్ రోబోట్లు.. సౌర-విద్యుత్ ఫెర్రీలతో సముద్ర రవాణా ఆర్థిక వ్యవస్థను మార్చిన నవాల్ట్.. ప్రతి ప్రయాణీకుడికి కిలోమీటరుకు కేవలం నాలుగు పైసల ఖర్చుతో నడుస్తున్న సముద్ర రవాణా ఆవిష్కరణలు.. "డ్రోన్ దీదీస్ ఆఫ్ కాశీ" ద్వారా మహిళలను ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యవసాయ-పారిశ్రామికవేత్తలుగా మార్చిన మారుత్ డ్రోన్‌ల గురించి ఆయన ఉదాహరణలుగా చెప్పారు. ఈ విజయగాథలన్నీ, పట్టుదలతో కూడిన విజయం అసాధారణమైన దానిని కూడా సాధ్యం చేస్తుందని అదానీ అన్నారు.

2025లో యువ ఆవిష్కర్తల ప్రతిభ..

ఈ ఏడాది గ్రీన్ టాక్స్ వేదికపై ఐదుగురు యువ పారిశ్రామికవేత్తలు తమ వినూత్న ఆలోచనలు పంచుకున్నారు.

  • అభిషేక్ చ్చజేద్ (రికైక్లెక్స్) - పర్యావరణ అనుకూల నిర్మాణ సామగ్రి ద్వారా నిర్మాణ రంగాన్ని డీకార్బనైజ్ చేస్తున్నారు.
  • అక్షితా సచ్‌దేవా, బోనీ డేవ్ (ట్రెస్టిల్ ల్యాబ్స్) - దృష్టి లోపం ఉన్న వారికి కిబో అనే సాంకేతిక వేదికతో సహాయం చేస్తున్నారు.
  • మనోజ్ శంకర్ (నెమోకేర్ వెల్‌నెస్) - సరసమైన నియోనాటల్, తల్లి ఆరోగ్య పరికరాలను అభివృద్ధి చేస్తున్నారు.
  • జెనిల్ గాంధీ, మనన్ వ్యాస్ (అవిన్యా లెదర్) - మొక్కల ఆధారిత, క్రూరత్వం లేని వేగన్ లెదర్ తయారు చేస్తున్నారు.
  • సౌమ్య బాలేంద్రన్ (సీ6 ఎనర్జీ) - బయోఫ్యూయెల్స్, బయోప్లాస్టిక్స్, ఎరువుల కోసం సముద్ర సీవీడ్ వ్యవసాయంను విస్తరిస్తున్నారు.

వీరందరూ భారతీయ ఆవిష్కరణలు ప్రపంచ సమస్యలను పరిష్కరించే శక్తి కలిగినవని నిరూపించారు.

సోషల్ ఇంపాక్ట్ అవార్డులు..

ఈ ఏడాది నుంచి అదానీ గ్రీన్ టాక్స్ సోషల్ ఇంపాక్ట్ అవార్డులు ప్రధానం చేపట్టారు. వందలాది దరఖాస్తులలోంచి సామాజిక ప్రభావం చూపగల విప్లవాత్మక ఆవిష్కరణలను ఎంపిక చేసి వారిని సత్కరించారు.

లోక్ కళ్యాణ్ అవార్డు..

భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లాకు ప్రారంభ లోక్ కళ్యాణ్ అవార్డు అందజేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కోవాక్సిన్ అభివృద్ధి చేసి లక్షలాది ప్రాణాలను రక్షించినందుకు ఆయనకు ఈ గౌరవం లభించింది. అదానీ, డాక్టర్ ఎల్లా చేసిన కృషిని ప్రపంచ ఆరోగ్య రంగానికి మైలురాయిగా అభివర్ణించారు. ఈ అవార్డును స్వీకరించిన డాక్టర్ ఎల్లా, దీనిని భారతీయ శాస్త్రవేత్తలు మరియు ఆవిష్కర్తలకు అంకితం చేశారు.

గ్రీన్ టాక్స్ వేదికలో విక్రాంత్ మాస్సే..

జాతీయ అవార్డు గ్రహీత నటుడు విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్ సినిమా) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన కథ పట్టుదల, కష్టపడే తత్వం ప్రతి అడ్డంకిని అధిగమించగలదనే దానికి ప్రతీక అని అదానీ పేర్కొన్నారు. యువ ఆవిష్కర్తల కథలతో ఆయన ప్రయాణం చాలా పోలికలు ఉన్నాయని అన్నారు.

భవిష్యత్ ప్రణాళికలు..

గ్రీన్ టాక్స్ భవిష్యత్ దిశగా ఎన్డీటీవీ భాగస్వామ్యంతో భారతదేశంలోని టైర్-2, టైర్-3 నగరాల్లో మార్పు సృష్టికర్తలను అన్వేషించనున్నట్లు అదానీ ప్రకటించారు. ఊహించని గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ఆలోచనలను కూడా అంతర్జాతీయ వేదికలతో అనుసంధానించే లక్ష్యం ఉందన్నారు. ఒడిశా లేదా లడఖ్ వంటి ప్రాంతాల నుండి వెలువడే ఆవిష్కరణలు, సావో పాలో లేదా నైరోబి లాంటి నగరాల్లోని ఆలోచనలతో కలసి ఒక గ్లోబల్ సహకార నెట్‌వర్క్‌గా మారాలని అదానీ ఆకాంక్ష వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+