అదానీ స్పీడ్ మామూలుగా లేదుగా! భారత లాజిస్టిక్స్‌లో సరికొత్త చరిత్ర!

అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) ఓ అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. అదానీ పోర్ట్స్ సంస్థ ఏకంగా 500 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని చేరుకుని, భారత మౌలిక సదుపాయాల రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అహ్మదాబాద్‌లోని అదానీ కార్పొరేట్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఈ విజయాన్ని అధికారికంగా ప్రకటించారు.

దార్శనికతకు దక్కిన ప్రతిఫలం

ఈ సందర్భంగా అదానీ పోర్ట్స్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ఈ 500 మిలియన్ టన్నుల లక్ష్యం కేవలం ఓ సంఖ్య మాత్రమే కాదని, ఇది తమ సంస్థ పట్టుదల, సామూహిక కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. 1990వ దశకంలో ముంద్రా పోర్ట్ అభివృద్ధిని ప్రారంభించినప్పుడు కనీస సౌకర్యాలు కూడా లేవని.. కానీ దృఢ నిశ్చయం, ఆశావాదంతో ముందుకు సాగడం వల్లే నేడు ఈ స్థాయికి చేరుకున్నామని గౌతమ్ అదానీ గుర్తు చేసుకున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో విస్తరణ

ముంద్రా పోర్ట్‌తో ప్రారంభమైన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(APSEZ) ప్రస్థానం నేడు భారత్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా విస్తరించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, శ్రీలంక, టాంజానియా వంటి దేశాలతో కలిపి మొత్తం 19 పోర్టులు, టెర్మినల్స్‌తో కూడిన భారీ నెట్‌వర్క్‌ను ఈ సంస్థ కలిగి ఉంది. కార్గో ప్రవాహాన్ని మెరుగుపరచడం, పారిశ్రామిక వృద్ధిని పెంచడమే లక్ష్యంగా ఓ సమగ్ర లాజిస్టిక్స్ వ్యవస్థను నిర్మించినట్లు గౌతమ్ అదానీ వెల్లడించారు.

కార్మికులే వెన్నెముక

అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(APSEZ) విజయ ప్రస్థానంలో గ్రౌండ్ లెవల్‌లో పనిచేసే సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని గౌతమ్ అదానీ కొనియాడారు. క్రేన్ ఆపరేటర్లు, మెరైన్ స్టాఫ్, లాజిస్టిక్స్ ప్లానర్లు, నిర్వహణ బృందాలతో పాటు వలస కార్మికుల అంకితభావం సంస్థకు వెన్నెముకగా నిలిచిందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంస్థలో నిర్ణయాధికారాన్ని మరింత వేగవంతం చేసేందుకు మూడు అంచెల విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

2030 నాటికి 1 బిలియన్ టన్నుల లక్ష్యం

భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరిస్తూ.. 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కార్గో సామర్థ్యాన్ని చేరుకోవడమే తమ తదుపరి లక్ష్యమని గౌతమ్ అదానీ ప్రకటించారు. రాబోయే కాలంలో లాజిస్టిక్స్, మెరైన్ సేవలు ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి 100 మిలియన్ టన్నుల మైలురాయిని గతంలో కంటే వేగంగా చేరుకుంటున్నామని, ఇది సంస్థ వృద్ధి వేగాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఈ మైలురాయి ఓ ప్రేరణగా నిలుస్తుందని గౌతమ్ అదానీ ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+