భవిష్యత్తులో ATMలు కనిపించవు? RBI రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు

భవిష్యత్తులో ఏటీఎంలు కనిపించవా? దేశ వ్యాప్తంగా చాలా ఏటీఎంలు ఎందుకు మూతపడుతున్నాయి? ఆర్బీఐ నివేదికలో వెల్లడైన సంచలన విషయాలేంటి? ట్రాన్సాక్షన్లు తగ్గి నిర్వహణ ఖర్చులు పెరగడం దేనికి సంకేతం? 2026 లో బ్యాంకులపై ఏటీఎంల నిర్వహణ ఎంత మేర పడబోతుంది?

దేశంలో ఏటీఎంలు దుర్భరంగా మారుతున్నాయి. చాలా చోట్ల ఏటీఎంలు విధి కుక్కలకు ఆవాసాలుగా మారిపోయాయి. సరైన నిర్వహణ లేక చాలా చోట్ల ఏటీఎంలు పని చేయని పరిస్థితి. ఏటీఎం గదుల అద్దె, సెక్యూరిటీ గార్డుల జీతాలు, విద్యుత్ బిల్లులు పెరగడంతో బ్యాంకులపై ఆర్థిక భారం పడుతోంది. ట్రాన్సాక్షన్లు తగ్గి నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఏటీఎంలు నిర్వహించడం బ్యాంకులకు లాభదాయకంగా అనిపించడం లేదు. పైగా దేశంలో ఏటీఎం మిషన్ల సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పడుతుంది. అసలు ఏటీఎంల వద్ద ఏం జరుగుతుంది అని ఆర్బీఐ ఆరా తీసింది. ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ద్వారా ఆర్బీఐ నివేదిక తెప్పించుకుంది.

డీమానటైజేషన్ టైంలో కిటకిటలాడిన ఏటీఎం సెంటర్లు.. 2025 నాటికి ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. డిజిటల్ మార్పు వల్ల ఏటీఎంలకు వెళ్లే వారు తగ్గిపోయారు. టీ తాగినా యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నాం. డబ్బులు చేతిలో చాలనకున్న రోజుల నుంచి.. ఫోన్‌ చేతిలో ఉంటే చాలు అనుకునే స్థాయికి మనం వచ్చేశాం. ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్‌లైన్ లావాదేవీల వల్ల ప్రజలు నగదు విత్‌డ్రా 5 శాతానికి తగ్గిపోయింది. వంద మందిలో కేవలం 10 మంది మాత్రమే నగదు చెల్లింపులు చేస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి.

Are ATMs Disappearing in India

కుంచించుకుపోయిన వ్యవస్థ..

ఆర్బీఐ లెక్కల ప్రకారం 2025 లో ఏటీఎం నెట్‌వర్క్ 1.6% మేరకు పడిపోయింది.2025 ప్రారంభంలో దేశంలో మొత్తం ఏటీఎంలు 2,19,281. 2025 చివరికి వచ్చే సరికి ఆ సంఖ్య 2,15,767కి తగ్గాయి. ఇక ప్రైవేట్ బ్యాంకులు అత్యధికంగా 79,884 నుంచి 77,117 పడిపోయాయి. ప్రభుత్వ బ్యాంకులకు చెంది ఏటీఎం సెంటర్లు 1,34,694 నుంచి 1,33,544కి. బ్యాంకుల వద్దే ఉండే ఏటీఎం సెంటర్లు పర్వాలేదనిపించాయి. కానీ బ్యాంకులకు దూరంగా ఉండే ఏటీఎంలే ఎక్కువగా మూతపడిన వాటి లిస్ట్ లో ఉన్నాయి.

ఇక్కడ హైలెట్ ట్విస్ట్ ఏంటంటే.. ఒక వైపు ఏటీఎంలు తగ్గుతున్నాయి.. కానీ బ్యాంకులు మాత్రం కొత్త కొత్త బ్రాంచ్ లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.64 లక్షల బ్యాంక్ శాఖలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే 2.8 శాతం కొత్తగా బ్రాంచ్లు ఏర్పాటు చేసుకున్నాయి బ్యాంకులు. ఇలా కొత్తగా ఏర్పాటైన శాఖల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులే అధికంగా ఉన్నాయని ఆర్బీఐ నివేదికలో తేలింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+