ఇలా విజయ్ మాల్యా బీరాలు: కింగ్‌ఫిషర్ రుణాలు లెక్క కాదని గొప్పలు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: భారత బ్యాంకులకు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ బాకీలు తీర్చడం తమకు కష్టం కాదని లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా కంపెనీ యునైటెడ్ బ్రేవరీస్ హోల్డింగ్స్ (యూబీహెచ్ఎల్) పేర్కొంది. కింగ్ ఫిషర్ తీసుకున్న రుణాలకు హామీదారుగా ఉన్న యూబీహెచ్ఎల్ బెంగళూరు హైకోర్టు ముందు హాజరై వాదన వినిపించింది. షేర్ మార్కెట్ వాటాలతో కలిపి తమకు రూ.12,400 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయన్నది.

కింగ్ ఫిషర్ రుణాలు తిరిగి చెల్లించేందుకు అవి సరిపోతాయన్నది. విజయ్ మాల్యా నుంచి రూ.9 వేల కోట్ల రుణాలను వసూలు చేసేందుకు.. భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

మార్కెట్ ఒడిదొడుకులతో యూబీహెచ్ఎల్ ఆస్తులు పతనం ఇలా
రుణాలను తిరిగి చెల్లించలేని విధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తమ ఆస్తులను జప్తు చేసిందని యూబీహెచ్ఎల్ కోర్టుకు తెలిపింది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఇప్పటికే కంపెనీ ఆస్తులు రూ.13,400 కోట్ల నుంచి రూ. 12,400 కోట్లకు దిగజారాయని కంపెనీ న్యాయవాది కోర్టుకు నివేదించారు. కంపెనీ మొత్తం అప్పు రూ.10 వేల కోట్లు దాటకుండా చూడాలని, బ్యాంకు రుణాలు తీర్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు గతేడాది విజయ్ మాల్యా లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయనను దేశానికి తిరిగి రప్పించేందుకు భారత్ ప్రస్తుతం తీవ్రంగా న్యాయపోరాటం చేస్తోంది.

Assets worth Rs 12,400 crore can clear dues: Vijay Mallya's company to HC

కేవైసీ నిబంధనలను పాటించని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్

ఆర్‌బీఐ మార్గదర్శకాల్ని ఉల్లఘించడం, నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) నిబంధనలను పాటించకపోవడంతో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఖాతాదారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే వారి ఖాతాలు ప్రారంభించినట్లు గత ఏడాది నవంబర్ 20-22 తేదీల మధ్య ఆర్బీఐ నిర్వహించిన పరిశీలనలో తేలింది. దాదాపు 23 లక్షల ఖాతాలు ఇలా తెరిచినట్లు తేటతెల్లమవడంతో జనవరి 15న ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. తాము సూచించిన మార్గదర్శకాలు పాటించకుండా ఖాతాలు తెరిచినందువల్ల జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలంటూ అందులో పేర్కొంది. బ్యాంకు ఇచ్చిన సమాధానం విన్న తరవాత రూ.5 కోట్ల జరిమానా విధించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జనవరి నుంచి ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

Assets worth Rs 12,400 crore can clear dues: Vijay Mallya's company to HC

17 కోట్ల పాన్‌కార్డులు కూడా ఆధార్‌తో ఇలా అనుసంధానం

పాన్‌కార్డులు, బ్యాంకు ఖాతాల్ని ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 17 కోట్ల పాన్‌కార్డులు, 88 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానమైనట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 'మార్చి 5 నాటికి 16,65,82,421 పాన్‌కార్డుల్ని ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. అలాగే మార్చి 2 నాటికి 87.79 కోట్ల బ్యాంకు ఖాతాలు కూడా ఆధార్‌తో అనుసంధానం అయ్యాయ'ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ప్రతాప్‌ శుక్లా లోక్‌సభకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. బ్యాంకు శాఖల్లో మార్చి 2 నాటికి 6,811 ఆధార్‌ నమోదు, సవరణల కేంద్రాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆధార్‌ చట్టానికి విరుద్ధంగా గుర్తింపు వివరాల్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే క్రిమినల్‌ నేరం కిందకు వస్తుందని చెప్పారు. అలాగే పాన్‌కార్డు ఉన్నవారు కూడా తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Assets worth Rs 12,400 crore can clear dues: Vijay Mallya's company to HC

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BENGALURU: United Breweries Holdings (UBHL), the holding company of Vijay Mallya’s UB Group, on Thursday said before the Karnataka High Court that the total value of its assets/shares exceeds Rs 12,400 crore at current market values and that can easily clear all outstanding dues, including the Rs 6,000-crore loans, with interest, owed by Kingfisher Airlines to its lenders.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి