వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

48 గంటల పాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ నెల 30, 31 తేదిల్లో సమ్మెకు దిగుతున్నట్టు బ్యాంకు ఉద్యోగు సంఘాల నేతలు ప్రకటించారు. పే రివిజన్ ను సమీక్షించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలతో బ్యాంక్ యాజమాన్యాలు చర్చించాయి. కానీ, ఈ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెకు పిలుపునిచ్చాయి.

Bank employees to go on 48 hrs strike from 30th May

ఈ విషయమై కేంద్రం జోక్యం చేసుకోవాలని కూడ బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్స్ నేతలు డిమాండ్ చేశారు. 15 శాతం వేతన సవరణ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, కేవలం 2 శాతం మాత్రమే వేతనాలు పెంచేందుకు బ్యాంకు యాజమాన్యాలు ముందుకు వచ్చాయి.

దీంతో బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది. మరో వైపు పారిశ్రామిక వేత్తలు బ్యాంకులకు వేలాది కోట్లు రుణాలుగా తీసుకొని ఎగ్గొట్టడం వల్ల బ్యాంకులు నష్టాలబారినపడుతున్నాయి.

ఉద్యోగులను విభజించి పబ్బం గడుపుకొనేందుకు పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారని బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ నేతలు ఆరోపిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా మే 30, 31 తేదిల్లో రెండు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయమేర్పడనుంది. జూన్ 1వ తేదిన బ్యాంకులు తెరుచుకోనున్నాయి.

English summary
Accusing Indian Banks Association (IBA) of not fulfilling their demands, the government bank employees will go on 48 hours strike from 6am, May 30th till 6am, June 1st.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X