సిగరెట్లు, గుట్కా ప్రియులకు బిగ్ షాక్..!

కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ సామాన్యుడి ఆరోగ్యంతో పాటు ఖజానా ఆదాయంపై దృష్టి సారించింది. పొగాకు ఉత్పత్తుల వినియోగదారులకు, ధూమపానం చేసే వారికి కేంద్ర సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది. నేటి(ఫిబ్రవరి 1) నుంచి సిగరెట్లు, పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తులపై కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం వల్ల ఒక్కో సిగరెట్ నుంచి ఒక్కో పాన్ మసాలా ప్యాకెట్ వరకు ధరలు రెండంకెల స్థాయిలో పెరగనున్నాయి.

28 శాతం నుంచి 40 శాతానికి జీఎస్టీ పెంపు.. ఎందుకీ మార్పు?

జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 'సిన్ గూడ్స్' అంటే ఆరోగ్యానికి హాని చేసే వస్తువులపై గరిష్టంగా 28 శాతం పన్ను ఉండేది. కానీ పన్ను ఎగవేతను అరికట్టడానికి, వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దీన్ని 40 శాతానికి పెంచింది. దీనికి అదనంగా ఎక్సైజ్ డ్యూటీ ఉండటంతో, మొత్తం పన్ను భారం ఊహించని స్థాయికి చేరుకుంది.

Cigarettes and Pan Masala Prices Hike New GST Rates and Excise Duty Effective from Feb 1 2026

సిగరెట్ల ధరలపై 'స్టిక్' వారీగా భారం
ప్రభుత్వం కేవలం పన్ను పెంచడమే కాకుండా సిగరెట్ పొడవును బట్టి పన్నును వర్గీకరించింది. ఇది బ్రాండెడ్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

చిన్న సిగరెట్లు (65మిమీ లోపు): ఇవి సాధారణంగా తక్కువ ధరకు దొరుకుతాయి. వీటిపై ఒక్కో స్టిక్‌కు సుమారు రూ. 2.05 అదనంగా పన్ను పడుతుంది. అంటే ప్యాకెట్‌కు రూ. 20-25 వరకు పెరగవచ్చు.

మీడియం, లాంగ్ సిగరెట్లు: 70మిమీ పైన ఉండే సిగరెట్లపై ఒక్కో స్టిక్‌కు రూ. 5.4 నుంచి రూ. 8.50 వరకు ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. ఫలితంగా ప్రీమియం బ్రాండ్ల ధరలు చుక్కలను తాకనున్నాయి.

'హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్' - కొత్త అస్త్రం!
పన్ను రూపంలో వచ్చే ఆదాయాన్ని కేవలం ఖజానాకే కాకుండా, ప్రజారోగ్యం, దేశ భద్రత కోసం వినియోగించేలా ప్రభుత్వం కొత్తగా 'హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్'ను కేంద్రం ప్రవేశపెట్టింది. దీనివల్ల పొగాకు కంపెనీలు అదనపు నిధులను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

పాన్ మసాలా కంపెనీలపై 'డిజిటల్' నిఘా:
గుట్కా, పాన్ మసాలా రంగంలో జరుగుతున్న పన్ను ఎగవేతను అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన నిబంధనలను తెచ్చింది. ప్రతి ప్యాకింగ్ మెషీన్ వద్ద సీసీటీవీ ఉండాలి. ఎప్పుడైనా అధికారులు తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఉత్పత్తి అయిన ప్యాకెట్లపై పన్ను వేసేవారు. ఇప్పుడు మెషీన్ సామర్థ్యం బట్టి పన్ను వేస్తారు. అంటే మెషీన్ నడిచినా, నడవకపోయినా పన్ను చెల్లించాల్సిందే. వరుసగా 15 రోజులు ఆగిపోతేనే మినహాయింపు ఉంటుంది.

ఎంఆర్‌పీ ఆధారిత వాల్యుయేషన్:
ఇకపై ఫిల్టర్ ఖైనీ, జర్దా, సుగంధ పొగాకు వంటి ఉత్పత్తులపై పన్నును కంపెనీలు చూపించే ధరపై కాకుండా, ప్యాకెట్‌పై ముద్రించిన గరిష్ట విక్రయ ధర (MRP) ఆధారంగా లెక్కిస్తారు. దీనివల్ల కంపెనీలు తక్కువ విలువ చూపించి ట్యాక్స్ ఎగ్గొట్టే ఛాన్స్ ఉండదు.

ఈ పన్నుల మార్పు వల్ల ఏడాదికి ప్రభుత్వానికి దాదాపు రూ. 10,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ధరలు పెరగడం వల్ల అక్రమ రవాణా పెరగకుండా చూడటం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలుగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+