వామ్మో.. భారత్‌లో ఇన్ని క్రెడిట్ కార్డులా.. కానీ ఖర్చు మాత్రం డౌన్!

ఇండియాలో పండుగల సీజన్ కోలాహలంగా సాగుతోంది. పండుగల కొనుగోళ్ల కోసం ప్రజలు నగదు, యూపీఐ, డెబిట్ కార్డులతో పాటు క్రెడిట్ కార్డులను కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దేశంలో క్రెడిట్ కార్డులకు పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబిస్తూ.. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ 'జెఫరీస్' ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం.. దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య ఏటా స్థిరంగా పెరుగుతున్నప్పటికీ.. వాటి ద్వారా చేసే మొత్తం వ్యయం మాత్రం ఊహించని విధంగా తగ్గడం గమనార్హం.

Credit Card Bill: మినిమమ్ డ్యూ కడుతున్నారా?
Credit Card Bill: మినిమమ్ డ్యూ కడుతున్నారా?

కార్డుల సంఖ్య పెంపు.. తగ్గిన ఖర్చులు
జెఫరీస్ రిపోర్టు ప్రకారం.. సెప్టెంబర్ 2026 నాటికి దేశంలో యాక్టివ్‌గా ఉన్న మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 12.38 కోట్లకు చేరింది. క్రెడిట్ కార్డుల సంఖ్యలో వార్షిక ప్రాతిపదికన 9.5 శాతం వృద్ధి నమోదైంది. అయితే కార్డుల సంఖ్య పెరిగినప్పటికీ.. సెప్టెంబర్‌లో క్రెడిట్ కార్డుల ద్వారా జరిగిన మొత్తం వ్యయం ఏడాది ప్రాతిపదికన 6.2 శాతం క్షీణించింది. ఆగస్టు నెలలో ఈ వ్యయం 5.5 శాతం వృద్ధి సాధించగా.. సెప్టెంబర్‌లో తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నెలావారీ ప్రాతిపదికన చూస్తే మాత్రం క్రెడిట్ కార్డ్ పరిశ్రమ మొత్తం వ్యయం 0.7 శాతం స్వల్పంగా పెరిగి రూ.2 ట్రిలియన్ల(రూ.2 లక్షల కోట్లు)కు చేరింది. గతేడాది పండుగలు త్వరగా రావడం, జీఎస్టీ తదితర అంశాల వల్ల గతేడాది నమోదైన అధిక బేస్ ఎఫెక్ట్ కారణంతోనే ఈ సారి వార్షిక వ్యయంలో తగ్గుదల కనిపించిందని ఆ రిపోర్టు పేర్కొంది.

Credit Cards Reach 12 38 Crore in India But Spends Fall 6 2 in September Says Jefferies Report

ఎస్బీఐ కార్డు, ఇతర బ్యాంకుల ప్రదర్శన
దేశంలోని ప్రధాన క్రెడిట్ కార్డ్ జారీ సంస్థల ప్రదర్శన వివిధ రకాలుగా ఉంది. 'ఎస్బీఐ కార్డు' విషయానికి వస్తే సెప్టెంబర్ నెలలో 2.1 లక్షల కొత్త కార్డులను జారీ చేసింది. ఇది మొత్తం పరిశ్రమలో నమోదైన కొత్త కార్డులలో 18 శాతం కావడం విశేషం. దీనితో ఎస్బీఐ కార్డు మొత్తం మార్కెట్ వాటా 19 శాతంగా కొనసాగుతోంది. ఇక ఇతర ప్రధాన బ్యాంకుల విషయానికొస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక ప్రాతిపదికన కార్డుల సంఖ్యలో 8 శాతం వృద్ధి నమోదు చేయగా.. యాక్సిస్ బ్యాంక్ 7 శాతం వృద్ధి సాధించింది. అయితే ఇండస్‌ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల సంఖ్యలో 6 శాతం క్షీణత నమోదైంది.

నెలకు లక్ష నుండి రెండున్నర లక్షలు సంపాదించే ఈ బిజినెస్ కు ఏపీ సర్కార్ అండ!
నెలకు లక్ష నుండి రెండున్నర లక్షలు సంపాదించే ఈ బిజినెస్ కు ఏపీ సర్కార్ అండ!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆధిపత్యం
మొత్తం క్రెడిట్ కార్డ్ వ్యయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. ఈ బ్యాంక్ మార్కెట్ వాటా నెలావారీగా 167 బేసిస్ పాయింట్లు పెరిగి 32 శాతానికి చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ప్రతి కార్డుపై సగటు వ్యయం రూ.22,600 నుంచి రూ.23,800కు పెరిగింది. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ వాటా 81 బేసిస్ పాయింట్లు తగ్గి 15 శాతానికి పరిమతమవ్వగా.. యాక్సిస్ బ్యాంక్ మార్కెట్ వాటా స్థిరంగా 11 శాతంగా నమోదైంది. మిగిలిన చాలా బ్యాంకులు కార్డ్-పాయింట్ సగటు వ్యయంలో స్వల్పంగా తగ్గింపు కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+