Credit Card వడ్డీ రేట్లపై పురందేశ్వరి యుద్ధం
క్రెడిట్ కార్డ్... అవసరానికి ఉపయోగపడాల్సిన సౌకర్యం. కానీ ఇప్పుడు అదే సామాన్యుల మెడకు చుట్టుకుంటున్న ఆర్థిక ఉచ్చుగా మారుతోందా? అధిక వడ్డీ రేట్లు, భారీ పెనాల్టీ ఛార్జీలతో కోట్లాది మంది వినియోగదారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్న వేళ, ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ అవసరమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి కలిసి వినతిపత్రం అందజేశారు.
భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై 24 శాతం నుంచి 48 శాతం వరకు, కొన్ని సందర్భాల్లో 55 శాతం దాటే వార్షిక వడ్డీ రేట్లు వసూలు చేయడం సాధారణంగా మారిందని పురందేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీతో పాటు లేట్ ఫీజులు, పెనాల్టీ ఛార్జీలు కూడా కలిస్తే వినియోగదారులపై పడుతున్న భారం మరింత పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ఇది మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.

అప్పుల ఊబిలో..
క్రెడిట్ కార్డులను సులభంగా ఇచ్చేస్తున్న బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు... వడ్డీ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకసారి బిల్లు ఆలస్యమైతే, ఆ తర్వాత చెల్లింపులు చేసినా వడ్డీ భారం తగ్గకపోవడం వల్ల చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి ఉందని వినియోగదారుల సంఘాలు కూడా చెబుతున్నాయి.
అమెరికాలో మాదిరి..
ఈ సందర్భంగా అంతర్జాతీయ ఉదాహరణను ప్రస్తావించిన పురందేశ్వరి, అమెరికాలో క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10 శాతానికి పరిమితం చేయాలనే ప్రతిపాదనను అక్కడి ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. వినియోగదారులను దోపిడీ రుణ విధానాల నుంచి కాపాడటమే ఆ నిర్ణయం వెనుక ఉద్దేశమని తెలిపారు.
ఆర్బీఐ మార్గదర్శకాలకు అణుగుణంగా..
అదే తరహాలో భారతదేశంలో కూడా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాల్సిన అవసరం ఉందని పురందేశ్వరి స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా, వినియోగదారుల హితాన్ని కాపాడేలా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆమె కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు.
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న ఈ కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం మరింత విస్తరిస్తోంది. అయితే నియంత్రణలు లేకపోతే, ఈ సౌకర్యమే ప్రజలకు భారంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పురందేశ్వరి చేసిన ఈ విజ్ఞప్తి నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం, RBI ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
🇮🇳 క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ అవసరం!
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) January 22, 2026
🔸భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై 24% నుంచి 48% వరకు, కొన్ని చోట్ల 55%కి పైగా వార్షిక వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలు విధించడం సాధారణ ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోంది.
🔹ఈ నేపథ్యంలో, వినియోగదారులను దోపిడీ రుణ విధానాల… pic.twitter.com/hwExutPrKP
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications