ఇండియా లోకి ఎలాన్ మస్క్ "టెస్లా".. తొలి షోరూమ్ అక్కడే ?

అపర కుబేరుడు ఎలన్ మస్క్ నేతృత్వంలోని.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం టెస్లా.. భారత్ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెడుతోంది. ఈ మేరకు తొలి షోరూమ్‌ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. అందులో భాగం గానే జియో వరల్డ్ సెంటర్‌లో ఈ నెల జూలై 15న గ్రాండ్ ఓపెనింగ్‌ నిర్వహించనుంది.

4 వేల చదరపు అడుగుల విశాలమైన షోరూమ్..

ముంబైలోని ప్రీమియం బిజినెస్ హబ్ అయిన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టెస్లా షోరూమ్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. దీనికి అతి చేరువ లోనే ప్రఖ్యాత యాపిల్ స్టోర్ కూడా ఉండనుండడం కలిసొచ్చే అంశం. వినియోగదారుల కోసం ప్రత్యేక పార్కింగ్, ఇ-వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు సహా పలు సౌకర్యాలతో ఈ షోరూం తయారవుతోంది. ఈ ప్రాపర్టీని యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి 5 ఏళ్ల లీజుపై టెస్లా తీసుకుందని.. నెలకు రూ. 35 లక్షల అద్దెతో పాటు, ప్రతి ఏడాది 5% అద్దె పెంపు ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే టెస్లా రూ. 2.11 కోట్ల అడ్వాన్స్ చెల్లించిందని సమాచారం.

elon-musks-tesla-to-start-first-showroom-in-india

మరోవైపు తొలి షోరూమ్‌ను ప్రారంభించేందుకు ముందు జాగ్రత్తగా చైనాలోని టెస్లా ఫ్యాక్టరీ నుంచి 5 Model Y కార్లు ఇప్పటికే భారత్‌కు దిగుమతి చేయబడ్డాయి. డిస్‌ప్లే, టెస్ట్ డ్రైవ్, ప్రాథమిక మార్కెట్ స్టడీకి ఉపయోగపడనున్నాయి. Model Y అనేది టెస్లా కంపెనీలో అత్యధికంగా అమ్ముడయ్యే SUV మోడల్ కావడం విశేషం.

ఇక ఇండియా మార్కెట్‌లోకి రాకకు టెస్లా చాలా కాలంగా ప్రయత్నం చేస్తోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న అధిక దిగుమతి సుంకాలు, అలాగే దేశీయ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులు కారణంగా జాప్యం అయ్యింది. 2023లో అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ - ఎలన్ మస్క్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో టెస్లా భారత మార్కెట్‌ ఎంట్రీకి సంబంధించి కీలక చర్చలు జరిగాయి. ఫలితంగా రూ. 34 లక్షలకు పైగా ధర కలిగిన హైఎండ్ ఈవీ కార్లపై కస్టమ్స్ సుంకాల్లో మినహాయింపులు ప్రకటించబడ్డాయి. ఈ నేపథ్యంలో టెస్లా ఎంట్రీ ఓఫిషియల్‌గా కన్‌ఫర్మ్ అయింది.

ముంబైలోని షోరూమ్‌కు వచ్చే స్పందనను బట్టి, టెస్లా తన తదుపరి షోరూమ్స్‌ను ఢిల్లీలో, బెంగళూరులో ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా బెంగళూరు‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి స్టార్టప్ కల్చర్, సాంకేతిక మద్దతు దృష్ట్యా అది కీలక కేంద్రంగా మారనుంది. భారత మార్కెట్లో వ్యాపారం విస్తరించాలన్న ఉద్దేశంతో టెస్లా, దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల అసెంబ్లీ ప్లాంట్ స్థాపన పై సైతం ఆలోచిస్తోంది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఈ ఉద్దేశంతో ఇప్పటికే టెస్లా ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+