పాత నోట్లు చెల్లవా? 2005 ముందు నాటి కరెన్సీపై క్లారిటీ

"మీ జేబులో ఉన్న పాత 10, 20, 50, 100 రూపాయల నోట్లను ఇక చెల్లవా? 2005 నాటి నోట్లకు ప్రభుత్వం రద్దు చేసింది! జూన్ 30 తర్వాత ఇవి చెల్లవంటూ వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వస్తున్న మెసేజ్‌లను చూసి కంగారుపడి, ఆ నోట్లను మార్చుకోవడానికి కంగారుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారా?" అయితే ఒక్క క్షణం ఆగి ఈ విషయం తెలుసుకోండి. మీరు నమ్ముతున్న ఆ వార్తలన్నీ శుద్ధ అబద్ధం! ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మి ఆందోళన చెందవద్దని బ్యాంకులు స్పష్టంగా చెబుతున్నాయి.

Fact Check Are Pre-2005 Currency Notes Discontinued Bank of Maharashtra Dismisses Viral Rumors as Fake

అసలు ఆ వదంతులు ఎలా పుట్టాయి?

ఇటీవల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు చెందిన ఒక సర్క్యులర్‌ పేరుతో పాత నోట్ల ఉపసంహరణ గురించి సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. జూన్ 30 తర్వాత పాత సిరీస్ నోట్లు చెల్లవంటూ వచ్చిన వార్తలు సామాన్యుల్లో కలకలం రేపాయి. ఒకవేళ మళ్ళీ నోట్ల రద్దు ప్రక్రియ మొదలైందేమోనని చాలామంది ఆందోళన చెందారు. అయితే, ఈ వార్తలను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూర్తిగా ఖండించింది. తమ బ్యాంక్ బ్రాంచ్‌లలో పాత నోట్లను నిలిపివేసే ఉద్దేశం ఏదీ లేదని, ఆ మెసేజ్‌లు ఫేక్ అని స్పష్టం చేస్తూ అధికారికంగా #FakeMessageAlert ఇచ్చింది.

మన జేబుల్లోకి ప్లాస్టిక్ కరెన్సీ! పాలిమర్ నోట్లు అంటే ఏంటి?
మన జేబుల్లోకి ప్లాస్టిక్ కరెన్సీ! పాలిమర్ నోట్లు అంటే ఏంటి?

ఆర్బీఐ వాదన ఏంటి?

ఈ వదంతులపై స్పందించిన బ్యాంక్ యాజమాన్యం, భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపింది. 2015లో ఆర్బీఐ పాత నోట్ల మార్పిడి గురించి ఇచ్చిన పాత సూచనలను కొంతమంది వ్యక్తులు కావాలనే వక్రీకరించి, భయభ్రాంతులకు గురిచేసేలా ఈ వార్తలను సృష్టించారు. 2005కు ముందు నాటి నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన కరెన్సీ (Legal Tender) గానే కొనసాగుతాయని, వాటిని మార్చుకోవాల్సిన అవసరం గానీ, రద్దు చేసే ఉద్దేశం గానీ లేదని ఆర్బీఐ గతంలోనే స్పష్టం చేసింది.

పాత నోట్లు ఇప్పుడు కూడా మార్చుకోవచ్చా?
పాత నోట్లు ఇప్పుడు కూడా మార్చుకోవచ్చా?

సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి భయాందోళన కలిగించే వార్తలను నమ్మి కంగారు పడకండి. ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే ఆర్బీఐ లేదా మీ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే చూడాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+