పాత నోట్లు ఇప్పుడు కూడా మార్చుకోవచ్చా?

ఇంట్లో అటక మీదో, పాత పెట్టెల్లోనో పాత రూ.500, రూ.1000 నోట్లు దొరికాయా? వాటిని ఇప్పుడు మార్చుకోవచ్చంటూ ఎవరైనా మీకు మెసేజ్ పంపారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఆ వార్త నిజం కాదు, అచ్చంగా ఒక పెద్ద 'ఫేక్ న్యూస్'. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పాత నోట్ల మార్పిడికి కొత్త మార్గదర్శకాలు ఇచ్చిందంటూ నెట్టింట జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో' (PIB) తీవ్రంగా ఖండించింది.

గత కొన్ని రోజులుగా వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో "ఆర్బీఐ కొత్త రూల్స్ తెచ్చింది.. పాత నోట్లు ఉన్నవారు మళ్ళీ బ్యాంకుల్లో మార్చుకోవచ్చు" అనే సారాంశంతో కూడిన తప్పుడు ప్రకటన కనిపిస్తోంది. 2016 నవంబర్ 8న ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత, గడువు ముగిసి చాలా కాలమైనప్పటికీ.. ఇలాంటి వార్తలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి.

Don t Fall for Scams RBI Has Not Issued New Rules to Exchange Demonetized Notes Confirms PIB Fact Check

పీఐబీ ఫ్యాక్ట్ చెక్: అదంతా అబద్ధం!

ఈ వైరల్ మెసేజ్‌పై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పందిస్తూ.. "ఆర్బీఐ అటువంటి ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలు. ప్రజలు ఎవరూ వీటిని నమ్మవద్దు" అని స్పష్టం చేసింది. 2016లో రద్దయిన కరెన్సీని మార్చుకునే ప్రక్రియ ఎప్పుడో ముగిసిపోయిందని, ప్రస్తుతం ఆర్బీఐ వద్ద అలాంటి ఏ సౌకర్యం లేదని తేల్చి చెప్పింది.

RBI: రూ.10 వేలు దాటితే.. UPI పేమెంట్స్ పై కొత్త రూల్
RBI: రూ.10 వేలు దాటితే.. UPI పేమెంట్స్ పై కొత్త రూల్

మోసగాళ్ల ఉచ్చులో పడకండి!

పాత నోట్లు మారుస్తామంటూ కొందరు కమిషన్ల పేరుతో మోసం చేసే అవకాశం ఉందని, అందుకే ధృవీకరించని సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. కరెన్సీకి సంబంధించి ఏదైనా అధికారిక సమాచారం కావాలంటే నేరుగా RBI అధికారిక వెబ్‌సైట్ ను మాత్రమే సంప్రదించాలని పేర్కొన్నారు.

RBI గుడ్ న్యూస్: పొరపాటున డబ్బు పోయినా రూ. 25 వేలు వాపస్!
RBI గుడ్ న్యూస్: పొరపాటున డబ్బు పోయినా రూ. 25 వేలు వాపస్!

మీకు అనుమానం ఉంటే ఇక్కడ చెక్ చేయండి:

కేంద్ర ప్రభుత్వ పథకాలు లేదా నిర్ణయాలపై మీకు ఏవైనా అనుమానాస్పద మెసేజ్లు వస్తే.. మీరు నేరుగా పీఐబీని సంప్రదించి నిజానిజాలు తెలుసుకోవచ్చు.

  • వాట్సాప్ నంబర్: +91 8799711259
  • ఈమెయిల్: [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+