వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: వ్యక్తిగత పన్ను పరిమితి రూ.3 లక్షలకు పెంపు యోచన?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందని సమాచారం. వ్యక్తిగత పన్ను మినహయింపు పరిమితిని ఏడాదికి రూ. రెండున్నరలక్షల నుండి రూ. 3 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహలు చేస్తుందని సమాచారం.

శుభవార్త: 80 సీ సెక్షన్ కింద పెట్టుబడుల పరిమితుల పెంపుకు జైట్లీ యోచన?శుభవార్త: 80 సీ సెక్షన్ కింద పెట్టుబడుల పరిమితుల పెంపుకు జైట్లీ యోచన?

బడ్జెట్ సమావేశాల్లో వ్యక్తిగత పన్ను పరిమితిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. మధ్యతరగతి ప్రజలకు వెసులుబాటును కల్పించేందుకు సర్కార్ సన్నాహలు చేస్తోందని తెలుస్తోంది.

ఇదే జరిగితే మధ్య తరగతి ప్రజలకు మరింత వెసులుబాటు కల్గే అవకాశాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.గత ఏడాది బడ్జెట్ కంటే ఈ ఏడాది బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండే అవకాశాలు లేకపోలేదని విశ్వసనీయవర్గాల సమాచారం.

వ్యక్తిగత పన్ను మినహయింపు రూ.3 లక్షలకు పెంపు

వ్యక్తిగత పన్ను మినహయింపు రూ.3 లక్షలకు పెంపు

ఈ ఏడాది బడ్జెట్ మధ్యతరగతికి వరాలు కురిపించే అవకాశలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించేందుకు కసరత్తు చేస్తోందని సమాచారం. వ్యక్తిగత పన్ను పరిమితి ప్రస్తుతం ఏటా రూ. రెండున్నర లక్షల వరకు మాత్రమే ఉంది. అయితే దీన్ని రూ. మూడులక్షలకు పెంచాలని సర్కార్ భావిస్తోందని సమాచారం.

పన్ను మినహయింపు పెంపుతో, స్లాబుల సర్ధుబాటు

పన్ను మినహయింపు పెంపుతో, స్లాబుల సర్ధుబాటు

పన్ను మినహాయింపును పెంచడంతో పాటు, శ్లాబులను సర్దుబాటు చేయడం మధ్యతరగతి ప్రజలకు ముఖ్యంగా శాలరీ క్లాస్‌ వారికి ఎంతో మేలు చేకూరనుందని తెలుస్తోంది. గతేడాది బడ్జెట్‌లో పన్ను శ్లాబులను మార్చనప్పటికీ, చిన్న పన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరటను మాత్రమే ఇచ్చింది. గత ఏడాది కేవలం రెండున్నరలక్షలను మాత్రమే వ్యక్తిగత పన్ను మినహయింపు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.

పదిశాతం పన్ను రేటు

పదిశాతం పన్ను రేటు


గత ఏడాది వార్షికాదాయాన్ని రెండున్నర లక్షల నుండి ఐదులక్షల వరకు పన్ను రేటును పది శాతం నుండి 5 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రేటును 10 శాతం విధించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

పన్ను స్లాబుల సర్ధుబాటు

పన్ను స్లాబుల సర్ధుబాటు

అదేవిధంగా రూ.10-20 లక్షలున్న వారికి 20 శాతం, రూ.20 లక్షలు పైన ఆదాయమున్న వారికి 30 శాతం పన్ను రేటును విధించాలని భావిస్తోందని సమాచారం. ద్రవ్యోల్బణం పెరగడంతో జీవన వ్యయాలు భారీగా పెరిగాయని, దీంతో మినహాయంపుల బేసిక్‌ పరిమితిని, పన్ను స్లాబులను సర్దుబాటు చేసే అవకాశం ఉందని సమాచారం.

English summary
The middle class can hope for a big relief in 2018-19 Budget, which will also be the last regular Budget of the NDA government, as the finance ministry is contemplating to hike personal tax exemption limit and tweak the tax slabs, according to sources
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X