Honda Success Story: 1937లో టొయోటా కొట్టిన దెబ్బ.. 2026లో గ్లోబల్ ఎంపైర్!

ఒక్క రిజెక్షన్.. ఒక్క "నో" అనే పదం చాలామంది జీవితాలను అక్కడికక్కడే ఆపేస్తుంది. కానీ, అదే "నో" ఒక వ్యక్తికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మోటార్ సామ్రాజ్యాన్ని నిర్మించేలా పట్టుదలను నూరిపోసింది. 1937లో జపాన్‌కు చెందిన ఒక సామాన్య మెకానిక్, తను తయారుచేసిన డిజైన్‌ను పట్టుకుని ఒక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ తలుపు తట్టాడు. కానీ, "ఈ డిజైన్‌లో క్వాలిటీ లేదు, మా స్టాండర్డ్స్‌కు ఇది ఏమాత్రం సరిపోదు" అని అతన్ని నిర్దాక్షిణ్యంగా తిరస్కరించాయి ఆ కంపెనీ వర్గాలు.

ఒకవేళ అతడు ఆ క్షణంలోనే తన ఆశయాన్ని వదిలేసి ఉంటే, ఈరోజు ప్రపంచ వీధులపై అత్యంత నమ్మకమైన వాహనాలుగా తిరుగుతున్న 'హోండా' మనకు కనిపించేది కాదు. ఆ సాధారణ మెకానికే సోయిచిరో హోండా. తిరస్కరించిన చోటే తన విజయాన్ని ఆవిష్కరించి, శతాబ్దపు సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన ఆయన అద్భుత ప్రయాణం ఇది.

From Rejected Mechanic to Global Empire The Inspiring Success Story of Honda Founder Soichiro Honda

టొయోటా కొట్టిన దెబ్బ.. పాఠంగా మారిన అవమానం!

1937లో సోయిచిరో హోండా ప్యాషన్ ఉన్న ఒక చిన్న వర్క్‌షాప్‌ను ప్రారంభించి పిస్టన్ రింగులను తయారు చేయడం మొదలుపెట్టారు. ఎలాగైనా టొయోటా లాంటి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీకి వాటిని సరఫరా చేయాలనేది ఆయన ఆలోచన. అయితే, తొలి ప్రయత్నంలోనే ఆయన ఆశలకు గండిపడింది. టొయోటా ఆయన డిజైన్‌ను తిరస్కరించింది.

'నాలాలు కడిగేటోడా' అని ఎగతాళి చేశారు.. ఈ రోజు పద్మ విభూషణ్ ఇవ్వాలంటున్నారు
'నాలాలు కడిగేటోడా' అని ఎగతాళి చేశారు.. ఈ రోజు పద్మ విభూషణ్ ఇవ్వాలంటున్నారు

సాధారణ వ్యక్తులైతే నిరాశతో ఆ వ్యాపారాన్ని మూసేసేవారు. కానీ హోండా టొయోటాను గానీ, తన అదృష్టాన్ని గానీ నిందించలేదు. తన డిజైన్‌లో లోపం ఉందని అంగీకరించి, మళ్లీ స్కూలు బాట పట్టారు. మెటలర్జీ, ఇంజనీరింగ్ సూత్రాలను క్షణ్ణంగా అధ్యయనం చేశారు. రెండేళ్ల పాటు రాత్రింబవళ్లు శ్రమించి, టొయోటా సైతం ఆశ్చర్యపోయేలా అత్యుత్తమ క్వాలిటీతో పిస్టన్ రింగ్‌ను తిరిగి డిజైన్ చేసి ఒప్పించారు.

బాంబుల దాడికి కాలిపోయిన ఫ్యాక్టరీ.. సున్నా నుండి మళ్లీ మొదలు!

పరిస్థితులు మెరుగవుతున్నాయనుకున్న సమయంలోనే ప్రపంచ యుద్ధం విరుచుకుపడింది. వరుస బాంబు దాడుల్లో ఆయన ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఫ్యాక్టరీలు రెండుసార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కళ్ల ముందే ఏళ్ల శ్రమ బూడిదైపోయింది. ఆ వెంటనే దేశంలో తీవ్రమైన పెట్రోల్ కొరత ఏర్పడింది. ఎక్కడా ఇంధనం దొరక్క జనాలు నడవలేక, ప్రయాణాలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కానీ హోండా ఇక్కడే ఒక సరికొత్త అవకాశాన్ని చూశారు. ఇంజన్ తయారు చేయడానికి సిమెంట్ కూడా లేని పరిస్థితుల్లో, అందుబాటులో ఉన్న వనరులతోనే ప్రయోగాలు చేశారు. ఒక పాత సైకిల్‌కు చిన్న ఇంజిన్‌ను జోడించి "మోటార్ సైకిల్" రూపాన్ని తీసుకొచ్చారు. ఆ చిన్న ఆలోచనే లక్షలాది మంది సామాన్యుల రవాణా కష్టాలను తీర్చింది.

మైలేజ్ కావాలా? పవర్ కావాలా? Honda SP125 Vs Pulsar 125 – ఏది బెస్ట్?
మైలేజ్ కావాలా? పవర్ కావాలా? Honda SP125 Vs Pulsar 125 – ఏది బెస్ట్?

1948లో 'హోండా మోటార్': ఒక దిగ్గజ సామ్రాజ్య ఆవిర్భావం

ఈ అద్భుత ఆవిష్కరణ ఇచ్చిన ధైర్యంతో 1948లో 'హోండా మోటార్ కంపెనీ' అధికారికంగా రూపుదిద్దుకుంది. కేవలం ఒక చిన్న సైకిల్ ఇంజన్‌తో మొదలైన ప్రయాణం, దశాబ్దాల వ్యవధిలోనే కార్లు, మోటార్ సైకిళ్లు, పవర్ ఈక్విప్‌మెంట్స్ తయారు చేసే గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది.

ఈ రోజు హోండా ప్రపంచ వ్యాప్తంగా 1,90,000 మందికి పైగా ఉద్యోగులకు ఉపాధిని ఇస్తూ, అత్యంత విశ్వసనీయ ఇంజనీరింగ్ బ్రాండ్‌గా అవతరించింది. ఒరిజినల్ ప్రొడక్షన్‌లో క్వాలిటీ లేదని తిరస్కరించిన ఆటోమొబైల్ దిగ్గజాలకు పోటీగా నిలబడి, తనకంటూ ఒక కొత్త చరిత్రను సృష్టించుకుంది.

హోండా సక్సెస్ వెనుక ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన 3 సూత్రాలు:

  • రిజెక్షన్ ముగింపు అనుకోకూడదు: ఒక ప్రయత్నం విఫలమైతే అది జీవితానికి ముగింపు కాదు. మన లోపాలను సరిదిద్దుకుని మరింత బలంగా తిరిగొచ్చేందుకు అదొక అవకాశమని హోండా నిరూపించారు.
  • పరిమితుల్లోనే సృజనాత్మకత వెతుక్కోవడం: వనరులు లేవు అని కొందరు ప్రయాణం ఆపేస్తారు. కానీ ఉన్న వనరులతోనే సమస్యలకు కొత్త పరిష్కారాలు వెతకడమే అసలైన విజేత లక్షణం.
  • తనకంటే గొప్ప వ్యవస్థను నిర్మించడం: చాలామంది వ్యాపారాన్ని స్వార్థం కోసం లేదా తక్షణ లాభాల కోసం పెడతారు. కానీ హోండా తదనంతరం కూడా నిలిచిపోయే ఒక గొప్ప బ్రాండ్‌ను, నమ్మకమైన క్వాలిటీ సంస్కృతిని నిర్మించారు
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+