గణేశ చతుర్థి 2026: వైభవ లక్ష్మీ రాజయోగం.. వీరికి ఊహించని జాక్ పాట్!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం పడుతుంది. ఈ సంవత్సరం గణేశ చతుర్థి సెప్టెంబర్ 14న వస్తోంది. ఈ రోజు జ్యోతిష్యపరంగా చాలా శుభమైన యోగం ఏర్పడనుంది. శుక్రుడు ప్రస్తుతం తన స్వంత రాశి అయిన తులలో సంచరిస్తున్నాడు. సెప్టెంబర్ 13న చంద్రుడు కూడా తుల రాశిలో ప్రవేశించి 16వ తేదీ వరకు ఉంటాడు.
వైభవ లక్ష్మీ రాజయోగం
దీనివల్ల తులా రాశిలో శుక్ర-చంద్ర కలయికతో వైభవ లక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ధనం, సౌఖ్యం, వృత్తి విజయాలను కలిగిస్తుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని జాక్ పాట్ పొందుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి: వృషభ రాశిలో ఆరవ భావంలో ఈ యోగం ఏర్పడుతుంది. దీనివలన వృషభ రాశి జాతకులకు ఆర్థికంగా లాభాలు వస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. పాత పెట్టుబడుల నుంచి లాభం వస్తాయి. కుటుంబ హితుల ఆరోగ్యం మెరుగవుతుంది. కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది.
మీన రాశి: మీనరాశిలో ఎనిమిదవ భావంలో వైభవ లక్ష్మీ రాజ యోగం ఏర్పడుతుంది. మీనరాశి వారి ఆర్థిక స్థితి బలపడుతుంది. వ్యాపారంలో పురోగతి, జీవిత భాగస్వామి మద్దతు, తల్లిదండ్రుల నుంచి సహాయం లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి సమస్యలు పరిష్కారమవుతాయి.
కుంభ రాశి: కుంభరాశి వారి జాతకంలో ఆధ్యాత్మిక పురోగతి, విదేశీ ప్రయాణం, పూర్వీకుల ఆస్తి నుంచి లాభం కనిపిస్తాయి. కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ప్రత్యేక లాభం.
మకర రాశి: మకర రాశి వారి జీవితంలో కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఐటీ రంగం, వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య ఆందోళనలు తగ్గుతాయి. మొత్తంగా ఆర్థిక, వ్యాపార రంగాల్లో ఉన్న మకరరాశి వారికి పురోగతి కనిపిస్తుంది.సెప్టెంబర్ 7న గజకేసరి రాజయోగం.. ఈ రాశులవారి జీవితం స్వర్ణమయం!
తుల రాశి: తులారాశిలో మొదటి భావంలో వైభవ లక్ష్మీ రాజ యోగం ఏర్పడుతుంది. మంచి పనితీరు వల్ల మీ జీవితంలో పురోగతి వస్తుంది, అనుకోని ఆర్థిక లాభాలు వస్తాయి. వ్యాపారులకు కోరినంత లాభం వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. డబ్బు సమస్యలు తగ్గుతాయి.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications