మైలేజ్ కావాలా? పవర్ కావాలా? Honda SP125 Vs Pulsar 125 – ఏది బెస్ట్?
Honda SP 125 vs Bajaj Pulsar 125: మీరు ఈ ఫెస్టివల్ సీజన్లో 125సీసీ బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా?. అయితే మీరు మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హోండా SP125, బజాజ్ Pulsar 125 బైకుల మధ్య తేడాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈ రెండు బైకుల ధరలు గణనీయంగా తగ్గాయి.
ధరల పరంగా చూస్తే..
* బజాజ్ పల్సర్ 125 ఎక్స్-షోరూమ్ ధర రూ.79, 048 నుంచి రూ.86,444 మధ్య ఉంది.
*హోండా SP 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 85,564 నుంచి రూ.94,069 మధ్య ఉంది.
*ఆన్-రోడ్ ధరలో కూడా పల్సర్ 125 (సుమారు రూ.91,421 వరకు) కొద్దిగా చౌకగా ఉన్నప్పటికీ, SP125 టాప్ వేరియంట్‌లో లభించే అధునాతన ఫీచర్లను పరిగణనలోకి తీసుకోవాలి.

పనితీరు విషయానికి వస్తే..
రెండు బైక్‌లు 125సీసీ ఇంజన్ సెగ్మెంట్‌కు చెందినవే అయినా, వాటి రైడింగ్ అనుభవంలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. Bajaj Pulsar 125 కొంచెం ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉంటుంది, ఇది వేగవంతమైన యాక్సిలరేషన్, స్పోర్టీ రైడింగ్‌ను కోరుకునే వారికి, ముఖ్యంగా సిటీ ట్రాఫిక్ లేదా ఓవర్‌టేకింగ్‌లో మెరుగ్గా ఉంటుంది. దీనికి విరుద్ధంగా, Honda SP125 ఇంజిన్ అత్యంత రిఫైన్డ్‌గా, వైబ్రేషన్-ఫ్రీగా ఉంటుంది. ఇది లాంగ్-డ్రైవ్‌లకు, మారుమూల లేదా కొద్దిగా చెడిపోయిన రోడ్లపై కూడా స్థిరమైన, స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కాబట్టి రోజువారీ, సౌకర్యవంతమైన ప్రయాణానికి SP125, స్పోర్టీనెస్, పవర్‌కు పల్సర్ 125 ఉత్తమం.
మైలేజ్ విషయంలో..?
రోజువారీ రన్నింగ్‌లో అత్యంత కీలకమైన అంశం మైలేజ్. ఈ విభాగంలో Honda SP125 స్పష్టంగా విజేతగా నిలుస్తుంది. SP125 బైక్ ARAI-రేటెడ్ మైలేజ్ 63 kmpl కాగా, రియల్-వరల్డ్‌లో ఇది 55-60 kmpl వరకు ఇస్తుంది. మరోవైపు, Bajaj Pulsar 125 మైలేజ్ (క్లెయిమ్డ్) 50 kmpl కాగా, రియల్-వరల్డ్‌లో 40-45 kmpl చుట్టూ మాత్రమే ఉంటుంది. మీరు రోజుకు 40-50 కిలోమీటర్లు ప్రయాణించే వారైతే ఇంధన ఖర్చుల పరంగా Honda SP125 మీ జేబుకు చాలా తేలికగా ఉంటుంది.
ఫీచర్లు, టెక్నాలజీ పరంగా చూస్తే..
రెండు బైక్‌లు తమకంటూ ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. Honda SP125 4.2 అంగుళాల ఫుల్ డిజిటల్ క్లస్టర్, రియల్-టైమ్ ఫ్యూయల్ ఎకానమీ, డిస్టెన్స్-టు-ఎమ్టీ ఇండికేటర్ వంటి ఆధునిక ఫీచర్లతో పాటు, సౌకర్యవంతమైన 'సైలెంట్ సెల్ఫ్ స్టార్ట్ సిస్టమ్',LED హెడ్‌లైట్స్‌తో వస్తుంది. ఇది మరింత డిజిటల్,మోడ్రన్‌గా ఉంటుంది. దీనికి భిన్నంగా Bajaj Pulsar 125 స్పోర్టీ స్ప్లిట్ సీట్ డిజైన్‌తో పాటు, బ్లూటూత్ కనెక్టివిటీ (కాల్,నోటిఫికేషన్ అలర్ట్స్) అందిస్తుంది. ఇది రైడర్‌కు స్పోర్టీ అనుభూతితో పాటు కనెక్టివిటీని కూడా అందిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ పల్సర్‌లో (165mm) కొద్దిగా ఎక్కువగా ఉండగా, SP125లో 160mm ఉంది.
చివరి తీర్పు ఎటువైపు?
చివరి తీర్పులో మీ ప్రాధాన్యతను బట్టి ఎంపిక ఉంటుంది.మీ దృష్టి మైలేజ్, సున్నితమైన ఇంజిన్,తక్కువ మెయింటెనెన్స్‌పై ఉంటే Honda SP125 బెస్ట్ ఛాయిస్. అదే సమయంలో మీరు కొంచెం ఎక్కువ పవర్, స్పోర్టీ లుక్,తక్కువ ఆన్-రోడ్ ధరను కోరుకుంటే Bajaj Pulsar 125 సరైన ఆప్షన్ అవుతుంది.












Click it and Unblock the Notifications