తగ్గిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర (22 క్యారెట్లు) రూ.54,950కి చేరింది. ఒక గ్రాము బంగారం ధర రూ.5495గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గి రూ.59,950కి చేరింది. ఒక గ్రాము ధర రూ.5995గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,100గా ఉంది.కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,950గా ఉంది. బెంగళూరు, కేరళ, ముంబయిలోను ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం రూ.54,950గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.59,950గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,350, 24 క్యారెట్ల పసిడి రూ.60,380కి చేరింది. పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,950కి చేరింది. ఆర్థికంగా అనిశ్చితి పరిస్థితి ఉండటం, ఫెడ్ వడ్డీ ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. కేజీ వెండిపై 2300 తగ్గింది. ధర రూ.75వేలకు చేరింది. 100 గ్రాముల వెండి ధర రూ.7500గా ఉంది. హైదరాబాద్ లో కేజీ వెండి రూ.78,500 కాగా, కోల్ కతాలో రూ.75వేలు, బెంగళూరులో రూ.76వేలుగా ఉంది.












Click it and Unblock the Notifications