బంగారం ధరల్లో పురోగమనం- కొనుగోళ్లకు భారీగా ఊపు
దేశీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, పశ్చిమ దేశాల ఆంక్షల హెచ్చరికల నేపథ్యంలో సేఫ్ హెవెన్ గా భావించే బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపారు. దీంతో దేశీయ మార్కెట్లల్లో పసిడి ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఇక ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి.
సోమవారం నాటితో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 170 రూపాయల పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లల్లో రూ. 150, 18 క్యారెట్లల్లో రూ. 120 మేర పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ బంగారం ధర ఔన్సుకు 4,344.29 డాలర్ల వద్ద నిలకడగా కొనసాగుతోండగా, అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర 4,381.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిలోనే ఉంచవచ్చనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాలు కూడా మార్కెట్ కదలికలను శాసిస్తున్నాయి. అవే పరిణామాలు భారత్ లోనూ కనిపించాయి. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో పసిడి లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది.
ఎంసీఎక్స్‌లో పసిడి ధర 0.20 శాతం లాభంతో రూ. 1,54,090 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ఫ్యూచర్స్ ధర కూడా 0.29 శాతం లాభపడి ప్రతి కిలోకు రూ. 2,40,100 వద్ద కొనసాగుతోంది. రిటైల్ మార్కెట్లో కూడా వెండి కొనుగోళ్లు పుంజుకున్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,53,970 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్లు రూ. 1,41,139 గా నమోదు కాగా.. వెండి కిలో రూ. 2,39,930 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ. 1,51,410, 22 క్యారెట్లు రూ. 1,38,793, వెండి రూ. 2,30,420 వద్ద ట్రేడ్ అయింది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,475, 22 క్యారెట్లు - రూ. 14,185, 18 క్యారెట్లు - రూ. 11,955
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,475, 22 క్యారెట్లు- రూ. 14,185, 18 క్యారెట్లు - రూ. 11,606
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,475, 22 క్యారెట్లు- రూ. 14,185, 18 క్యారెట్లు - రూ. 11,606
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,475, 22 క్యారెట్లు- రూ. 14,185, 18 క్యారెట్లు - రూ. 11,606
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,475, 22 క్యారెట్లు- రూ. 14,185, 18 క్యారెట్లు - రూ. 11,606
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,475, 22 క్యారెట్లు- రూ. 14,185, 18 క్యారెట్లు - రూ. 11,606

Click it and Unblock the Notifications