తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన ధరలు: మళ్లీ ఆకాశానికి పసిడి, వెండి!
గడిచిన కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతూ ఇన్వెస్టర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. ముఖ్యంగా వెండి ధరలు ఆకాశన్నంటగా.. బంగారం కూడా అదే బాటలో పయనిస్తోంది. గత వారం రోజులుగా బులియన్ మార్కెట్ అస్థిరంగా మారుతుండటంతో అసలు ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
నేటి మార్కెట్ ధరల విశ్లేషణ
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో మంగళవారం(ఫిబ్రవరి 3) మధ్యాహ్నం 3 గంటల సమయానికి ధరల ట్రెండ్ చాలా ఉద్ధృతంగా ఉంది. వెండి కేవలం ఒకే రోజులో రూ.30,000 పెరిగి , కిలో వెండి ధర రూ.2.66 లక్షల పైన ట్రేడ్ అవుతోంది. మరోవైపు 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.8000 పెరిగి రూ.1.52 లక్షల మార్కును చేరింది. ఇలా అకస్మాత్తుగా ధరలు పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు.

'రోలర్ కోస్టర్' రైడ్‌ను తలపిస్తున్న పసిడి
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు ఒక 'రోలర్ కోస్టర్' రైడ్‌ను తలపిస్తున్నాయి. జనవరి 29న వెండి కిలో రూ.4.20 లక్షలు, బంగారం 10 గ్రాములు రూ.1.93 లక్షల వద్ద ఆల్-టైమ్ రికార్డును తాకాయి. అయితే ఆ తర్వాత కేవలం 4 రోజుల్లోనే వెండి రూ.1.95 లక్షలు తగ్గి రూ.2.25 లక్షలకు, బంగారం రూ.56,000 తగ్గి రూ.1.37 లక్షలకు పడిపోయాయి. ఇప్పుడు మళ్లీ రికవరీ మొదలై రెండు రోజుల్లోనే వెండి రూ.41,000, బంగారం రూ.15,000 వరకు పుంజుకున్నాయి.
పెరుగుదల వెనుక అసలు కారణాలు
ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు కారణమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో ట్రేడ్ డీల్ ప్రకటించడం, టారిఫ్ రేట్లను తగ్గించడం వంటి పరిణామాలతో మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడింది. దీనికి తోడు రికార్డు స్థాయిల నుంచి ధరలు భారీగా పడిపోవడంతో, ఇదే మంచి సమయమని ఇన్వెస్టర్లు "డిప్ కొనుగోళ్లు" చేస్తున్నారు. అంటే తక్కువ ధరకు దొరికినప్పుడు భారీగా స్టాక్ కొనుగోలు చేయడం వల్ల మళ్లీ డిమాండ్ పెరిగి ధరలు అమాంతం పైకి చేరుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి సెగలు పుట్టిస్తోంది. గోల్డ్ స్పాట్ ప్రైస్ ఔన్స్‌కు సుమారు 4,700 డాలర్ల నుంచి 4,950 డాలర్ల మధ్య కొనసాగుతుండగా.. వెండి ధర ఔన్స్‌కు 79 - 87 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతోంది. డాలర్ విలువలో మార్పులు, ప్రపంచ రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత్ వంటి దేశాల్లో కూడా దిగుమతి వ్యయం పెరిగి ధరలు నియంత్రణ లేకుండా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ ఉన్న స్థితిలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications