Gold Rate Today : మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. సామాన్యుడికి ఊహించని షాక్!
గత వారం రోజులుగా ఊగిసలాడుతున్న బంగారం ధరలు ఎట్టకేలకు మళ్లీ పైకి కదిలాయి. కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొనుగోలు చేయాలనుకునే సామాన్యులకు షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సంభవించిన అనూహ్య పరిణామాలు దేశీయంగా బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై కొత్త సుంకాలు విధించడంతో ప్రపంచ వాణిజ్య యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపించాయి. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగింది.
బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్న ప్రకారం, టారిఫ్స్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అల్లకల్లోలం అయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మదుపర్లు బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. నిన్నటి వరకు తగ్గిన ధరలు చూసి ఊపిరి పీల్చుకున్న సామాన్యులకు ఒక్కసారిగా ధరలు పెరగడం మింగుడుపడటం లేదు.

హైదరాబాద్‌లో బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం ఉదయం బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.90,400 లకు చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.82,900 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.65 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.71 మేర పెరిగింది. అంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.650, 24 క్యారెట్ల బంగారంపై రూ.710 చొప్పున ధర పెరిగింది.
ఢిల్లీలో పసిడి ధరలు
ఇతర నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.90,590 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.83,050 వద్ద ఉంది. వాణిజ్య నగరం ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,440 గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,900 గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,400, 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,900 వద్ద కొనసాగుతోంది. బెంగళూరు, కోల్‌కతా, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇదే స్థాయిలో ధరలు నమోదవుతున్నాయి.
వెండి ధరలు మాత్రం బంగారం ధరలకు భిన్నంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,02,000 వద్ద కొనసాగుతోంది. గ్రాము వెండి ధర రూ.102 గా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గ్రాము వెండిపై రూ.1, కిలో వెండిపై రూ.1000 చొప్పున తగ్గింది.
మొత్తానికి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరగడం కొనుగోలుదారులను నిరాశ పరుస్తున్నాయి. ధరలు మరింత పెరుగుతాయా లేక తగ్గుతాయా అనేది వేచి చూడాలి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడి పెట్టడం సురక్షితమైన ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications