Gold: పుత్తడి ధరల్లో మార్పు జరిగిందా? నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే
పండగల సీజన్ సమీపిస్తున్న వేళ పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. గడిచిన కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో మురిపించిన బంగారం ధరలు ఆదివారం రోజున స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి మార్పులు లేకుండా మార్కెట్లో ధరలు నిలకడగా ఉండటంతో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పుత్తడి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఇలా..
హైదరాబాద్, విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు సమానంగా నమోదయ్యాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం (10 గ్రాములు) ధర రూ. 1,54,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 1,41,900గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికొస్తే పది గ్రాముల ధర రూ. 1,16,100 వద్ద కొనసాగుతోంది.

వెండి కూడా స్థిరంగానే నిలిచింది. గ్రాము రూ.254.90 వద్ద ఉండగా.. కిలో రూ.2,54,900 గా కొనసాగుతోంది. ఈ రేట్లపై జీఎస్టీ ఉంటంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పరిస్థితులు
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు, కొల్కతాల్లోనూ పసిడి ధరలు దాదాపుగా స్థిరంగానే ట్రేడ్ అవుతున్నాయి. ముంబై, బెంగళూరు, కొల్కతా నగరాల్లో 24 క్యారెట్ల బంగారం తులం రూ. 1,54,800 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,41,900 వద్ద ఉంది. ఢిల్లీలో కొద్దిపాటి వ్యత్యాసంతో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 1,54,950గాను, 22 క్యారెట్ల బంగారం రూ. 1,42,050గాను నమోదైంది.'
చెన్నైలో కాస్త ఎక్కువ ధర!
మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం పసిడి ధరలు కొద్దిగా ఎక్కువగా పలుకుతున్నాయి. అక్కడ 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 1,56,670గా ఉండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,43,610కి చేరింది. ఇక 18 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 1,21,310 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ సూచీలు, స్థానిక పన్నుల వ్యత్యాసం వల్లే వివిధ నగరాల్లో ఈ స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.














Click it and Unblock the Notifications