బంగారం ధరలు బౌన్స్ బ్యాక్, ఒక్కసారిగా ఊహించని షాక్
గత మూడు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టి పసిడి ప్రియులకు కొంత ఉపశమనం కలిగించిన బంగారం ధరలు ఒక్కసారిగా బాట మార్చాయి. గత మూడు రోజుల్లో రూ.6,000 వరకు తగ్గిన పసిడి ధరలు, నేడు భారీగా పుంజుకుని కొనుగోలుదారులకు గట్టి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న మార్పులు, పెరిగిన డిమాండ్ కారణంగా స్థానిక బులియన్ మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా పైకి లేచాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్ సమచారం ప్రకారం, మేలిమి బంగారం (24 క్యారెట్లు) 10 గ్రాముల ధరపై నేడు ఏకంగా రూ.3,330 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల తుది ధర రూ.1,55,350కి చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.3,050 ఎగబాకి, ప్రస్తుతం రూ.1,42,400 వద్ద విక్రయమవుతోంది.

వెండి ధర కూడా ఆకాశానికే!
బంగారం బాటలోనే వెండి కూడా భారీ ఎత్తున ప్రియమైంది. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 వరకు ధర పెరిగింది. దీనితో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,50,000 మార్కును చేరింది. ఇక విడి మార్కెట్ సరఫరా వివరాల ప్రకారం నేడు గ్రాము వెండి ధర రూ.255గా ఉండగా, కేజీ వెండి ధర అత్యధికంగా రూ. 2,55,000 వరకు పలుకుతోంది.
ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు
- చెన్నై: గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.15,535, 22 క్యారెట్ల ధర రూ.14,240 మరియు 18 క్యారెట్ల ధర రూ.11,969గా ఉంది.
- ముంబై: గ్రాము 24 క్యారెట్ల పసిడి ధర రూ.15,535, 22 క్యారెట్ల ధర రూ.14,240 కాగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.11,651గా నమోదు కాబడింది.
- ఢిల్లీ: దేశ రాజధానిలో గ్రాము 24 క్యారెట్ల పసిడి ధర రూ.15,550, 22 క్యారెట్ల ధర రూ.14,255 కాగా, 18 క్యారెట్ల ధర రూ.11,666గా ఉంది.
- కోల్‌కతా: గ్రాము 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.15,535, 22 క్యారెట్ల ధర రూ.14,240 కాగా, 18 క్యారెట్ల ధర రూ.11,651గా నమోదైంది.
- బెంగళూరు: ఇక్కడ గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.15,535, 22 క్యారెట్ల ధర రూ.14,240 కాగా. 18 క్యారెట్ల ధర రూ.11,651గా కొనసాగుతోంది.














Click it and Unblock the Notifications