బంగారం రేట్లు ఢమాల్- నో గ్యారెంటీ
కొనుగోలుదారులకు పసిడి రేట్లు కొంత ఉపశమనం కలిగించాయి. నేడు దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకునే పరిణామాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు దేశీయంగా పసిడి ట్రెండ్‌లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వాటి రేట్లను శాసిస్తోన్నాయి. ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ ఏర్పడుతోంది. పండగల సీజన్ కూడా సమీపించిన నేపథ్యంలో ధరల తగ్గుదల మధ్యతరగతి కుటుంబాల వారికి ఊరట ఇచ్చినట్టయింది.
శుక్రవారం ఉదయం సెషన్ తో పోల్చుకుంటే సాయంత్రానికి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1,860 తగ్గింది. రూ.1,54,800 వద్ద స్థిరపడింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,700 క్షీణించి రూ.14,190గా నమోదైంది. 18 క్యారెట్ల బంగారం ధరలో రూ.1,390 తగ్గి రూ.11,610 వద్ద ట్రేడ్ అయింది. ఇదే ట్రెండ్ వచ్చే వారం కొనసాగుతుందనే గ్యారంటీ ఉండట్లేదు.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,800, 22 క్యారెట్లు రూ.1,41,900, 18 క్యారెట్లు రూ.1,16,100 వద్ద కొనసాగింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,670, 22 క్యారెట్లు రూ.1,43,610, 18 క్యారెట్లు రూ.1,17,100 వద్ద ట్రేడ్ అయింది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,800, 22 క్యారెట్లు రూ.141,900, 18 క్యారెట్లు రూ.1,16,100 వద్ద స్థిరపడింది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,667, 22 క్యారెట్లు - రూ. 14,361, 18 క్యారెట్లు - రూ. 12,131
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,480, 22 క్యారెట్లు- రూ. 14,190, 18 క్యారెట్లు - రూ. 11,610
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,480, 22 క్యారెట్లు- రూ. 14,190, 18 క్యారెట్లు - రూ. 11,610
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,480, 22 క్యారెట్లు- రూ. 14,190, 18 క్యారెట్లు - రూ. 11,610
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,480, 22 క్యారెట్లు- రూ. 14,190, 18 క్యారెట్లు - రూ. 11,610
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,480, 22 క్యారెట్లు- రూ. 14,190, 18 క్యారెట్లు - రూ. 11,610

Click it and Unblock the Notifications