పసిడి రేట్లల్లో తీవ్ర ఒడిదొడుకులు.. మరోసారి మార్జినల్ పతనం

బంగారం కొనుగోలుదారులకు నేడు కొంత ఉపశమనం లభించింది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల కారణంగా దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మార్జిన్ పతనాన్ని నమోదు చేశాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న తాజా అంతర్జాతీయ ఉద్రిక్తతలు తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పసిడి ధరలు బుధవారం నాడు గత మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అమెరికా చేపట్టిన తాజా వైమానిక దాడుల కారణంగా మధ్యప్రాచ్య సంక్షోభం మరింత ముదరడంతో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను పెంచడంతో స్పాట్ గోల్డ్ ధర 0.6 శాతం మేర క్షీణించి ఔన్సుకు 4,304.01 డాలర్ల వద్ద స్థిరపడింది.

Gold Rates in India Drift Lower on September 2 Amid Global Corrections as US-Iran Tensions Shakes

ఆగస్టు 7 తర్వాత అత్యంత కనిష్ట ట్రేడింగ్ స్థాయి కావడం గమనార్హం. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ట్రేడింగ్ నష్టాలను మూటగట్టుకుంటోంది. గ్లోబల్ సెంటమెంట్ బలహీనపడటంతో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బంగారం అమ్మకాలు మందగించాయి. 10 గ్రాముల బంగారం ధర 1.07 శాతం క్షీణించి రూ. 1,50,530 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా వెండి ఫ్యూచర్స్ ధర కూడా ఊహించని రీతిలో పతనమైంది.

రేవంత్ రెడ్డి 1,000 రోజుల పాలనపై హైదరాబాద్ లో పోస్టర్లు
రేవంత్ రెడ్డి 1,000 రోజుల పాలనపై హైదరాబాద్ లో పోస్టర్లు

ఎంసీఎక్స్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర దాదాపు 1.26 శాతం తగ్గి రూ. 2,31,830 వద్ద స్థిరపడింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,757 పలికింది. 24 క్యారెట్లు రూ. 1,50,280 కు క్షీణించింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 2,31,530 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,729 కాగా.. 24 క్యారెట్లు రూ. 1,50,250 వద్ద స్థిరపడింది. ఇక్కడ వెండి కిలో రూ. 2,31,410 గా రికార్డయింది. బెంగళూరులో 22 క్యారెట్లు రూ. 1,37,647, 24 క్యారెట్లు రూ. 1,50,160, వెండి రూ. 2,31,340, చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,37,940, రూ. 1,50,480, వెండి 2,31,840 గా రికార్డయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+