EPFO గుడ్ న్యూస్.. విత్ డ్రా లిమిట్ సడలింపుపై కీలక నిర్ణయం..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) విత్ డ్రా లిమిట్స్ ను సులభతరం చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఖాతాదారులు తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం పీఎఫ్ ఖాతా నుంచి తీసుకునే విత్ డ్రా లిమిట్ ను పెంచడంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తమ సేవింగ్స్ ను ఎలాంటి పరిమితులు, షరతులు లేకుండా ఖర్చు చేసుకునేందుకు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేస్తున్నట్లు సమాచారం.
EPFO త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. విత్ డ్రా లిమిట్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది. మనీ కంట్రోల్ సంస్థ రిపోర్టు ప్రకారం.. వ్యక్తిగత ఖాతాదారుల విత్ డ్రా లిమిట్ ను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. హౌసింగ్, వివాహం, విద్యపై విత్ డ్రా లిమిట్ ను సడలించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం EPFO ఖాతాదారులు 58 సంవత్సరాలు వచ్చాకే రిటైర్ మెంట్ కింద మొత్తం కార్పస్ ను విత్ డ్రా చేసుకునే వీలుంది. లేదా రెండు నెలలు అంతకంటే ఎక్కువ సమయం నిరుద్యోగిగా ఉన్నట్లయితే పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే మధ్యమధ్యలోనూ విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి.
వివాహానికి పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే 7 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఉంటే తన సొంత కంట్రిబ్యూషన్ నుంచి 50 శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. దానిపైన వచ్చిన వడ్డీని కూడా పొందొచ్చు. ఇది ఆ ఉద్యోగి వివాహం మాత్రమే కాకుండా వారి సోదరులు, సోదరీమణులు, సంతానానికి వర్తిస్తుంది. అలాగే ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం మొత్తం బ్యాలెన్స్ నుంచి 90 శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఆ ప్రాపర్టీ కచ్చితంగా ఉద్యోగి పేరుమీద ఉండాలి. లేదా భార్య లేదా ఇద్దరి పేరు మీద ఉండాలి. అలాగే ఖాతాదారుడు మూడు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉండాలి.

ఇక విద్య కోసం ఖాతాదారుడు 50 శాతం కంట్రిబ్యూషన్ ను విత్ డ్రా చేసుకునే వీలుంది. అయితే ఖాతాదారుడు ఏడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. ఇది పోస్ట్ మెట్రిక్యూలేషన్ పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. పీఎఫ్ విత్ డ్రా లిమిట్స్ సడలింపు వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు భారీ ఉపశమనం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications