సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్: తగ్గనున్న 175 వస్తువుల ధరలు
జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ సమావేశంలో సామాన్య ప్రజలకు, కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి కొత్త జీఎస్టీ సంస్కరణలను ప్రకటించిన తర్వాత ఇది మొదటి సమావేశం కావడంతో ప్రజలు, కంపెనీలు ఈ నిర్ణయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పన్ను రేట్లను క్రమబద్ధీకరించడంపై చర్చ జరుగుతుందని, దీనివల్ల రోజువారీ అవసరాలతో పాటు ఖరీదైన వస్తువుల ధరలు కూడా తగ్గుతాయని అన్నారు.
రెండు పన్ను శ్లాబులపై చర్చ
కేంద్రం ప్రతిపాదన ప్రకారం.. ఇప్పుడు కేవలం రెండు జీఎస్టీ శ్లాబులు మాత్రమే ఉండవచ్చు. దీనిలో 28 శాతం శ్లాబ్‌లో ఉన్న హానికర వస్తువులను మినహాయించి, మిగిలిన అన్ని వస్తువులను 18 శాతం శ్లాబ్‌లోకి తీసుకురావచ్చు. అదేవిధంగా, 12 శాతం శ్లాబ్‌లో ఉన్న వస్తువులను 5 శాతం శ్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. 40 శాతం పన్ను శ్లాబ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇది 6-7 హానికర, లగ్జరీ వస్తువులకు వర్తిస్తుంది.

175 వస్తువుల ధరలు తగ్గుతాయా?
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. దాదాపు 175 వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని తెలిపాయి. ఇందులో ఆహార పదార్థాలు, బాదం, స్నాక్స్, రెడీ-టు-ఈట్ వస్తువులు, జామ్, నెయ్యి, వెన్న, ఊరగాయలు, ఆటోమొబైల్స్, ట్రాక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఏసీలు, ఫ్రిజ్‌లు వంటివి ఉన్నాయి. మంత్రుల బృందం (జీవోఎం) రేట్ తగ్గింపు ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ అంగీకరిస్తే, ప్రస్తుతం సగటున 11.5 శాతంగా ఉన్న జీఎస్టీ రేటు 10 శాతం కంటే తక్కువకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య, జీవిత బీమాకు జీఎస్టీ మినహాయింపు
ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలను జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలని కూడా మంత్రుల బృందం ప్రతిపాదించింది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకారం, ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై పూర్తి మినహాయింపు ఇవ్వడం వల్ల సుమారు రూ. 9,700 కోట్ల వార్షిక ఆదాయ నష్టం జరుగుతుందని అంచనా. ఈ ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదిస్తే, సామాన్య ప్రజలకు ఇది ఒక పెద్ద ఉపశమనం అవుతుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications