కలిసొచ్చిన కుప్పం.. భారీ పెట్టుబడి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుప్పం.. ఇప్పుడు అంతర్జాతీయ పారిశ్రామిక చిత్రపటంలో మెరిసేందుకు సిద్ధమవుతోంది. ప్రఖ్యాత హిందాల్కో ఇండస్ట్రీస్ ఇక్కడ దాదాపు 586 కోట్ల రూపాయలతో భారీ పరిశ్రమను నెలకొల్పబోతోంది. సరికొత్త అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. అమెరికా దిగ్గజం యాపిల్ కోసం ఐఫోన్ చాసిస్ తయారీకి అవసరమైన హై-గ్రేడ్ అల్యూమినియం ఇక కుప్పం నుంచే సరఫరా కానుంది.
2027 మార్చి నాటికి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి. దీనివల్ల 613 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి. దీనికి తోడు లాజిస్టిక్స్, సర్వీసెస్, స్కిల్ డెవలప్మెంట్ వంటి రంగాల్లో భారీగా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. దీనికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరగనున్నాయి. ఇది ఓ ఫ్యాక్టరీ మాత్రమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌ను యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌లోకి తీసుకెళ్లే ఒ గేట్‌వే అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

హిందాల్కో కుప్పం ఎంచుకోవడానికి కారణం?
కుప్పం భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాంతం. రెండు మెట్రోసిటీలు.. బెంగళూరు- 120, చెన్నై- 200 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కుప్పానికి కలిసొచ్చింది. దీనివల్ల పొరుగు మెట్రో నగరాల్లోని మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా, బెంగళూరులో ఇటీవల కార్యకలాపాలు ప్రారంభించిన ఫాక్స్‌కాన్ వంటి యాపిల్ కాంట్రాక్ట్ తయారీదారులకు ఉత్పత్తులను సులభంగా సరఫరా చేయవచ్చు.
దీంతో పాటు ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ఇస్తున్న అపారమైన మద్దతు, వేగవంతమైన అనుమతులు కంపెనీ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. పెట్టుబడులపై రిస్క్‌ను తగ్గించి, ప్రాజెక్టు లాభదాయకతను పెంచడానికి రాష్ట్రం అమలు చేస్తున్న పీఎల్ఐ (Production Linked Incentive) పథకం కీలక పాత్ర పోషించింది. రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీ వనరులు అందుబాటులో ఉండటం, కంపెనీ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది.
జీరో వేస్ట్ టు ల్యాండ్‌ఫిల్, జీవవైవిధ్యం పరిరక్షణ వంటి విధానాలతో కంపెనీ పర్యావరణానికి కట్టుబడి ఉంది. రాష్ట్రం లక్ష్యాలు, విధానాలు కూడా ఇవే కావడం వల్ల భారీగా పెట్టుబడులను ఆకట్టుకుంటోంది. హిందాల్కో పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ యాపిల్ గ్లోబల్ సప్లై చైన్లో అధికారికంగా భాగమవుతుంది. ఇది భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుంది. రాష్ట్రంలో అత్యధిక విలువైన అల్యూమినియం మరియు అనుబంధ విడిభాగాల తయారీ ఎకోసిస్టం బలోపేతం అవుతుంది.
కుప్పం, ఆంధ్రప్రదేశ్‌ను స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్ తయారీకి భారతదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన ప్రత్యామ్నాయ పారిశ్రామిక క్లస్టర్‌గా నిలబెడుతుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన సంస్థ అయిన హిందాల్కో ఇండస్ట్రీస్, భారతదేశంలోని అతిపెద్ద మెటల్స్ కంపెనీలలో ఒకటి. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం, కాపర్ ఉత్పత్తిదారు. అంతర్జాతీయంగా, ఇది అల్యూమినియం ఉత్పత్తిదారులలో అగ్రగామిగా ఉంది. దాని అనుబంధ సంస్థ నోవెలస్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం రోలింగ్ కంపెనీగా గుర్తింపు పొందింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications